Begin typing your search above and press return to search.

యానిమల్ తో బాలయ్య అన్‌స్టాపబుల్‌ రికార్డ్‌!

యానిమల్ టీం పాల్గొన్న అన్‌ స్టాపబుల్‌ ఎపిసోడ్‌ ఏకంగా 25 మిలియన్ల వీక్షణ నిమిషాలను దక్కించుకుందని ఆహా అధికారికంగా ప్రకటించింది.

By:  Tupaki Desk   |   27 Nov 2023 7:04 AM GMT
యానిమల్ తో బాలయ్య అన్‌స్టాపబుల్‌ రికార్డ్‌!
X

నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. మూడో సీజన్‌ ను సినిమాల ప్రమోషన్ కోసమే అన్నట్లుగా చేస్తున్న బాలయ్య తాజాగా యానిమల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా రణబీర్ కపూర్, రష్మిక మందన్న మరియు సందీప్ వంగలతో చిట్ చాట్‌ చేసిన విషయం తెల్సిందే.


ఇటీవలే యానిమల్ టీం స్పెషల్‌ బాలయ్య అన్‌ స్టాపబుల్‌ సీజన్ 3 ఎపిసోడ్ స్ట్రీమింగ్‌ అయింది. ఈ ఎపిసోడ్‌ లో ఫోన్ ద్వారా విజయ్ దేవరకొండ పాల్గొనడం ద్వారా మరింతగా బలం చేకూరినట్లు అయింది. రష్మిక మరియు విజయ్ దేవరకొండ మధ్య ఏం జరిగింది, ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు అనే విషయాలను తెలుసుకునేందుకు ఆహా లో అన్‌స్టాపబుల్‌ ను ప్రేక్షకులు చూశారు.

యానిమల్ టీం పాల్గొన్న అన్‌ స్టాపబుల్‌ ఎపిసోడ్‌ ఏకంగా 25 మిలియన్ల వీక్షణ నిమిషాలను దక్కించుకుందని ఆహా అధికారికంగా ప్రకటించింది. చాలా తక్కువ సమయంలో ఈ అరుదైన రికార్డ్‌ ను దక్కించుకోవడం సంతోషంగా ఉందంటూ ఆహా టీమ్‌ సోషల్ మీడియా ద్వారా ఈ పోస్టర్ ని షేర్‌ చేయడం జరిగింది.

మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యానిమల్‌ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు ఫుల్‌ స్వింగ్ లో జరుగుతున్నాయి. నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరుగబోతుంది. మల్లారెడ్డి యూనివర్శిటీలో జరుగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో మహేష్ బాబు మరియు రాజమౌళి ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నారు.