Begin typing your search above and press return to search.

అన్ స్టాపబుల్ సీజన్ 3.. సెట్టయితే అలా..

ఈ సీజన్-3 కోసం ఆహా గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం సాగింది. ఎందుకంటే అసలే ఈ టాక్ షో.. ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనే హైయెస్ట్ వ్యూస్ దక్కించుకున్న టాక్ షో గా రికార్డ్స్ బ్రేక్ చేసింది.

By:  Tupaki Desk   |   19 Sep 2023 2:30 PM GMT
అన్ స్టాపబుల్ సీజన్ 3.. సెట్టయితే అలా..
X

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ షో.. ఆయన కెరీర్ కు అన్ స్టాపబుల్ గా క్రేజ్ పెంచింది. ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయినా ఈ సెలబ్రిటీ టాక్ షో విశేష ఆదరణ దక్కించుకుని రికార్డులు క్రియేట్ చేసింది. మహేశ్ బాబు, రవితేజ, పవన్ కల్యాణ్, ప్రభాస్, మాజీ సీఎం చంద్రబాబు లాంటి స్టార్స్​ తో సక్సెసఫుల్ గా రెండు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం.. సీజన్-3 కోసం అభిమానులు ఎంతో హుషారుగా చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడీ సీజన్ 3ను ప్రారంభించేందుకు మేకర్స్ గట్టిగా ప్రణాళికలు రచ్చిస్తున్నట్లు తెలిసింది.

బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాను పూర్తి చేసి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీగా ఉన్నారు. అలాగే మరోవైపు రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ అవ్వడంతో.. ఆయన్ను బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితమే అన్ స్టాపబుల్ మాస్ హంగామా సీజన్ 3.. త్వరలోనే ప్రారంభం అవుతుందనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ సీజన్-3 కోసం ఆహా గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం సాగింది. ఎందుకంటే అసలే ఈ టాక్ షో.. ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనే హైయెస్ట్ వ్యూస్ దక్కించుకున్న టాక్ షో గా రికార్డ్స్ బ్రేక్ చేసింది. బాలయ్య డైలాగ్స్, పంచ్ కామెడీ, మేనరిజం, ఆయన ఉరకలు వేసే ఉత్సాహం.. అన్నీ ఈ షోను మరో రేంజ్ కు తీసుకెళ్లాయి. దీంతో సీజన్-3 మరింత అట్టహాసంగా స్టార్ట్ చేయడంతో పాటు..ఊహకందని రీతిలో డిజైన్ చేయబోతున్నారని అన్నారు.

ఈ లేటెస్ట్ సీజన్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, విక్టరీ వెంకటేశ్.. లాంటి స్టార్స్ గెస్ట్ గా వస్తారని కూడా టాక్ వినిపించింది. కానీ ఆ తర్వాత మళ్లీ దీని గురించి ఎక్కడా ఏమీ వినపడలేదు. అయితే ఇప్పుడు బాలయ్య.. చంద్రబాబు అరెస్ట్ తో ఎదురైన ఉద్రిక్త పరిస్థితిలో టెన్షన్ గా బిజీగా గడుపుతున్న నేపథ్యంలో అన్ స్టాపబ్ సీజన్ 3 ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది.

ఈ సీజన్ కు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తో పాటు భగవత్ కేసరి మూవీ యూనిట్, చిరంజీవి కూడా గెస్ట్ లు వచ్చేలా ప్లానింగ్ ఉందని అంటున్నారు. ఈ ఎపిసోడ్స్ అన్నీ బాలకృష్ణ డేట్స్ అడ్జస్ట్ ను బట్టి సెట్ చేయాలని అనుకుంటున్నారట. ఇవన్నీ సెట్ అయితే అప్పుడు సీజన్ 3 ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో, ఎప్పుడు వస్తుందో.