సొంత నిర్మాణ సంస్థలో యంగ్ హీరో పాన్ ఇండియా!
'మార్కో' తో మలయాళం స్టార్ ఉన్ని ముకుందన్ సౌత్ లో ఏ రేంజ్ లో ఫేమస్ అయ్యాడో చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 23 July 2025 2:00 PM IST'మార్కో' తో మలయాళం స్టార్ ఉన్ని ముకుందన్ సౌత్ లో ఏ రేంజ్ లో ఫేమస్ అయ్యాడో చెప్పాల్సిన పనిలేదు. భారీ హింసతో కూడిన కంటెంటె తో రిలీజ్ అయిన మార్కో ముకుందన్ కు యాక్షన్ స్టార్ గా మంచి ఇమేజ్ ను తీసుకొచ్చింది. అందులో అతడి ఆహార్యం, లుక్, వైవిథ్యమైన నటన ప్రతీది కలిసొ చ్చింది. స్టార్ గా తనని తాను తీర్చి దిద్దుకున్న విధానం ఔరా అనిపిస్తుంది. ఆ చిత్రాన్ని తానే స్వయంగా నిర్మించాడు. తాజాగా ఉన్ని ముకుందన్ తనని తాను పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నాడు.
ఈ నేపథ్యంలో ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. మలయాళ దర్శకుడు జోషీతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది భారీ యాక్షన్ థ్రిల్లర్. మార్కో కి మూడింతలు యాక్షన్ ఉంటుందిట. ఈసినిమాను కూడా ఉన్ని ముకుందన్ స్వయంగా నిర్మిస్తున్నాడు. తన నిర్మాణ సంస్థ ఉన్ని ముకుందన్ ఫిల్మ్స్ ఐన్ స్టీన్ మీడియా సంస్థ భాగస్వామ్యంలో నిర్మిస్తున్నాడు. ఉన్ని ముకుందన్ గెపప్ సరికొత్తగా ఉండబోతుంది. కొత్త తరహా, కథ, కథనాలతో పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
బలమైన భావోద్వేగంతో యువతరాన్ని టార్గెట్ చేసి చేస్తోన్న చిత్రంగా వినిపిస్తోంది. మొత్తానికి ఉన్ని ముకుందన్ అసలైన ట్రాక్ లో ఇప్పుడే పడుతున్నాడు. మంచి హీరో కటౌట్ అయినా ఇంత వరకూ అతడి రేంజ్ సినిమా చేయలేదు. రకరకల కథలు, పాత్రలు చేసుకుంటూ వచ్చాడు. అవన్నీ మాలీవుడ్ కే పరిమితయ్యాయి తప్ప ఇతర భాషల్లో పేరు తెచ్చి పెట్టలేదు. 'మార్కో'తో అతడి లో ట్రాన్సపర్మేషన్ కనిపిస్తుంది.
వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నాడు. క్రియేటివ్ గా వచ్చిన కొత్త కుర్రాళ్లను ఎంకరేజ్ చేస్తున్నాడు. త్వరలో టాలీవుడ్ లోనూ స్ట్రెయిట్ సినిమా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించి న 'జనతా గ్యారేజ్' లో కీలక పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే. అదే ముకుందన్ తొలి తెలుగు సినిమా. అటుపై 'భాగమతి', ' కిలాడీ', 'యశోద' లాంటి చిత్రాల్లోనూ నటించాడు.
