డైరెక్టర్ గా మరో స్టార్ హీరో!
ఈ నేపథ్యంలో తాజాగా ఉన్ని ముకుందన్ కూడా కెప్టెన్ కుర్చీ ఎక్కడానికి రెడీ అవుతున్నాడు.
By: Tupaki Desk | 8 May 2025 10:30 PMమాలీవుడ్ స్టార్స్ డైరెక్టర్లగా కూడా సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పృధ్వీరాజ్ సుకుమార్ హీరోగా..డైరెక్టర్ గా రాణిస్తున్నాడు. ఆయన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ రూపంలోనూ విడుద లవుతు న్నాయి. టాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా చిత్రాల్లో సైతం పృధ్వీరాజ్ కీలక పాత్రల్లో అలరిస్తున్నాడు. ఇలా నటుడిగా, డైరెక్టర్ గా బిజీగా ఉన్నాడు.
అలాగే సీనియర్ హీరో మోహన్ లాల్ కూడా 'బరోజ్' తో కెప్టెన్ కుర్చీ ఎక్కిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో స్వీయా దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రమిది. నటుడిగా 400 చిత్రాలకు చేరువలో ఉన్న మోహన్ లాల్ దర్శకుడిగా సత్తా చాటాలని తొలి ప్రయత్నం చేసినా ఫలితం మాత్రం ఆశాజనకంగా రాని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఉన్ని ముకుందన్ కూడా కెప్టెన్ కుర్చీ ఎక్కడానికి రెడీ అవుతున్నాడు.
మాలీవుడ్ లో ఓ భారీ సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఇందులో ఆయనే హీరోగా నటిస్తాడా? లేక దర్శకుడిగా ఉంటాడా? అన్నది తెలియాల్సి ఉంది. ఇటీవల రిలీజ్ అయిన 'మార్కో' తో ఉన్ని ముకుందన్ మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. తెలుగులోనూ ఈ సినిమా మంచి వసూ ళ్లను సాధించింది. నటుడిగా అతడి రేంజ్ పెరిగింది. తెలుగులోనూ అవకాశాలు అందుకుంటున్నాడు.
సరిగ్గా ఇదే సమయంలో డైరెక్టర్ గా టర్న్ తీసుకుంటున్నాడు. మరి సీరియస్ గా సినిమాలే డైరెక్ట్ చేస్తాడా? రెండింటిని బ్యాలెన్స్ చేస్తాడా? అన్నది చూడాలి. 'జనతా గ్యారేజ్' చిత్రంలో ఉన్ని ముకుందన్ మోహన్ లాల్ కుమారుడి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. 'కిలాడీ', 'యశోద' చిత్రాల్లో కూడా కీలక పాత్రలతో అలరించాడు.