Begin typing your search above and press return to search.

మాజీ మేనేజర్ కంప్లైంట్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో..

ఇప్పుడు ఆ విషయంపై ఉన్ని ముకుందన్ స్పందించారు. మేనేజర్ విపిన్ కుమార్ ఆరోపణలు నిరాధారమైనవని తెలిపారు.

By:  Tupaki Desk   |   27 May 2025 4:01 PM IST
మాజీ మేనేజర్ కంప్లైంట్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో..
X

మాలీవుడ్ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ పై ఆయన వద్ద పని చేసిన మేనేజర్ విపిన్ కుమార్.. ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనపై దాడి చేశారని.. ఆయన మాజీ మేనేజర్ విపిన్ కుమార్ కొచ్చిలోని ఇన్ఫో పార్క్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. టోవినో థామస్ నరివెట్టా సినిమా కోసం విపిన్ పోస్ట్ చేయడంతో ఆయన అలా చేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు ఆ విషయంపై ఉన్ని ముకుందన్ స్పందించారు. మేనేజర్ విపిన్ కుమార్ ఆరోపణలు నిరాధారమైనవని తెలిపారు. తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శారరీకంగా ఎలాంటి హాని తలపెట్టలేదని.. మొత్తం సీసీటీవీలో రికార్డు కూడా అయిందని పేర్కొన్నారు. ఓ ఫ్రెండ్ దాన్ని చూశారని ముకుందన్ వెల్లడించారు.

విపిన్ ఇప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా తన తప్పులను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. అదే సమయంలో టోవినో థామస్ తో విబేధాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలపై రెస్పాండ్ అయ్యారు. తాను టోవినోకు ఇప్పటికే కాల్ చేసి మొత్తం వివరించానని తెలిపారు. అతడు మొత్తం అర్థం చేసుకున్నాడని చెప్పారు. ఏ తప్పుడు పుకారు తమ ఫ్రెండ్ షిప్ ను డిస్టర్బ్ చేయదని చెప్పారు.

కాగా, ఉన్ని ముకుందన్ తనను తన ఫ్లాట్ కింద ఉన్న పార్కింగ్ ఏరియాకు పిలిపించారని ఫిర్యాదులో మేనేజర్ విపిన్ పేర్కొన్నారు అప్పుడు తనను తీవ్రమైన పదజాలంతో దూషించారని, ఆ తర్వాత దాడి చేశారని ఆరోపించారు. ఇంటి అద్దాలు కూడా పగలుగొట్టారని చెప్పారు. తాను ఆరేళ్లపాటు ముకుందన్ వద్ద మేనేజర్‌గా పనిచేశానని పేర్కొన్నారు.

ఇక ముకుందన్ కెరీర్ విషయానికొస్తే.. అనేక మాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో నటించిన ఆయన మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలు చేశారు. ఇప్పుడు అనేక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వరుస షూటింగ్స్ తో తీరిక లేకుండా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. అందులో బడా చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి.

అయితే తెలుగులో కూడా భారీ చిత్రాల్లో నటించారు ముకుందన్. జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్, భాగమతి, ఖిలాడీ, యశోద వంటి అనేక సినిమాల్లో యాక్ట్ చేసి ఆకట్టుకున్నారు. రీసెంట్ గా గెట్ - సెట్ - రెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ముకుందన్ నటుడిగానే కాకుండా నిర్మాతగా కూాడా సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.