ప్రభుత్వ సహకారం మాకొద్దు అనేసిన కామ్రేడ్!
పేపర్ లీక్ పేరుతో ఎంతో మంది తెలివైన విద్యార్దులు నష్టపోతున్నారు. పరీక్షల్లో ఫెయిలయ్యామని ఆత్మహత్యలు చేసుకుంటారు.
By: Tupaki Desk | 11 July 2025 5:27 PM ISTసినిమా వాళ్లకు ప్రభుత్వం నుంచి రాయితీలు, ట్యాక్స్ మినహాంపులు ఇస్తామంటే ఎవరికి చేదు? అందరూ ఎంచక్కా తీసుకుంటారు. కానీ పిపూల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి మాత్రం తన సినిమా కు ఎలాంటి ట్యాక్స్ మినహాంపులు వద్దని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన దర్శకత్వంలో `యూనివర్శిటీ పేపర్ లీక్` అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 22న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా కామ్రేడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
తెలంగాణ ప్రభుత్వం నుంచి రాయితీలు వద్దని, సినిమాను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. అద్దంకి దయాకర్ తాను ప్రభుత్వంతో మాట్లాడి ట్యాక్స్ మినహాయింపు ఇస్తామన్నారు. కానీ తన సినిమాకు ట్యాక్స్ ప్రీ అవసరం లేదని ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ సక్రమంగా చెల్లిస్తామన్నారు. కానీ నారాయణ మూర్తి ప్రభుత్వాన్ని ఒక్కటే కోరారు. తన సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రమోట్ చేయాలన్నారు. ఇదే ప్రభుత్వం తనకు చేసే పెద్ద సహాయంగా అభివర్ణించారు. ఇలాంటి సినిమాలు కిల్ అవ్వకూడదు.
పేపర్ లీక్ పేరుతో ఎంతో మంది తెలివైన విద్యార్దులు నష్టపోతున్నారు. పరీక్షల్లో ఫెయిలయ్యామని ఆత్మహత్యలు చేసుకుంటారు. గ్రూప్ 1 ,2 పరీక్షా పత్రాలు లీక్ అవ్వడం చూస్తుంటే చదువులకు ఏమైంద నిపిస్తుంది? ఇది ఇలాగే కొనసాగితే విద్యార్దుల భవిష్యత్ ఏం కావాలి? కష్టపడి చదివిన వారి పరిస్థితి ఏంటి? నిరుద్యోగులు జీవితాలు ఏమైపోవాలి? రెండో ప్రపంచ యుద్దంలో అమెరికా జపాన్ పై వేసిన అణుబాంబు కన్నా ప్రమాదకరమైన పరిస్థితి ఇది.
చూసి రాసిన వాళ్లు డాక్టర్లు అయితే రోగులకు రోగాలు తగ్గుతాయా? వాళ్లు బ్రతికి ఇంటికి చేరుకుంటారా? ఇంజనీర్లు కట్టిన భవనాలు, భవంతులు, బ్రిడ్జ్ లు నిలబడతాయా? సమాజంలో ఇలాంటి దారుణాలు ఇప్ప టివరకూ ఎన్ని చూడలేదు. అందుకే ఇలాంటి దారుణాలు జరగకూడ దనే ప్రశ్నా పత్రాలు లీకులు కాకూ డదు. ప్రభుత్వం ఇలాంటి వాటిపై కఠినంగా వ్యవరించాలి` అని అన్నారు. నారాయణ మూర్తి ఏ సినిమా తీసినా? ప్రభుత్వాలను సూటిగా ప్రశ్నిస్తున్నట్లే ఉంటుంది. ప్రభుత్వాల తీరును ధైర్యంగా ఎండ గట్టడం అన్నది కామ్రేడ్ కి మాత్రమే చెల్లింది.
