Begin typing your search above and press return to search.

శంక‌ర్ నుంచి ఊహించ‌ని స‌ర్ ప్రైజ్!

ఆ కాంబినేష‌న్ లో సినిమా ఉంటుంద‌ని చాలా బ‌ల‌మైన ప్ర‌చారం సాగింది.

By:  Tupaki Desk   |   28 Feb 2024 10:42 AM GMT
శంక‌ర్ నుంచి ఊహించ‌ని స‌ర్ ప్రైజ్!
X

డైరెక్ట‌ర్ ఎన్. శంక‌ర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. 'ఎన్‌కౌంట‌ర్‌'.. 'జ‌యం మ‌న‌దేరా'..' ఆయుధం'.. 'భ‌ద్రాచ‌లం'.. 'జై భోలో తెలంగాణ' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్ని తెర‌కెక్కించి ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్థానం సంపాదించుకున్నారు. విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ని సైతం త‌న క‌థ‌తో మెప్పించారు. ఆ కాంబినేష‌న్ లో సినిమా ఉంటుంద‌ని చాలా బ‌ల‌మైన ప్ర‌చారం సాగింది. కానీ ఎందుక‌నో అది సాద్య‌ప డ‌లేదు.

ఆ త‌ర్వాత ఆయ‌న చివ‌రిగా '2 కంట్రీస్' అనే చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఆ త‌ర్వాత ఇంత‌వ‌ర‌కూ మ‌ళ్లీ సినిమాలు చేసింది లేదు. అయితే చాలా గ్యాప్ త‌ర్వాత శంక‌ర్ వెడ్ వ‌ర‌ల్డ్ లోకి అడుగు పెడుతున్నారు. ఆయ‌న స్వీయా ద‌ర్శ‌క‌త్వం నిర్మాణంలో మూడు వెబ్ సిరీస్ లు తెర‌కెక్కించ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ మూడు చారిత్రాత్మ‌క వెబ్ సిరీస్ లుగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు.

తెలంగాణ సాయిధ పోరాటం నుంచి.. రాష్ట్ర ఏర్పాటు వరకు.. మొదటి వెబ్ సిరీస్...మ‌హ‌త్మ జ్యోతీరావు పూలో స్పూర్తితో రెండ‌వ వెబ్ సిరీస్..అణ‌గారిన వ‌ర్గాల కోసం పాటు ప‌డిన అంబేద్క‌ర్ ఆశ‌యాల్ని ఆధా రంగా చేసుకుని మూడ‌వ వెబ్ సిరీస్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. మూడు వెడ్ సిరీస్ లు సంచ‌ల నాత్మ‌క అంశాల‌గానే క‌నిపిస్తున్నాయి. తెలంగాణ పోరాటాన్ని మొట్ట మొద‌టి సారి వెబ్ సిరీస్ గా తీసుకురావ‌డం అన్న‌ది ఇదే తొలిసారి.

ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటు అన్న‌ది దేశ వ్యాప్తంగా అప్ప‌ట్లో ఎంత సంచ‌ల‌మైందో తెలిసిందే. అలాగే జ్యోతిరావు పూలే..అంబేద్క‌ర్ ఆశ‌యాల‌కు సంబంధించిన అంశాల్ని వివిధ కోణాల్లో తెర‌పైకి తీసుకు రావ‌డం ప్ర‌శంసించ ద‌గ్గ విష‌య‌మే. ఇంత‌వ‌ర‌కూ ఏ ద‌ర్శ‌కుడు ఆ గొప్ప వ్య‌క్తుల్ని ట‌చ్ చేసింది లేదు. వాళ్ల మ‌నోగ‌తాల్ని బ‌లంగా చెప్పింది లేదు. తాజాగా శంక‌ర్. ఎన్ ఆ ఛాన్స్ తీసుకుంటున్న‌ట్లు క‌నిపిస్తుంది.