Begin typing your search above and press return to search.

మళ్లీ వచ్చిన వెంకీ మామ..!

వసూళ్ల విషయంలో కాస్త నిరాశ పరిచిన కూడా వెంకటేష్ అభిమానులు మాత్రం చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   3 Feb 2024 4:48 AM GMT
మళ్లీ వచ్చిన వెంకీ మామ..!
X

వెంకటేష్ మొన్న సంక్రాంతికి సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సైంధవ్‌ సినిమా కి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. వసూళ్ల విషయంలో కాస్త నిరాశ పరిచిన కూడా వెంకటేష్ అభిమానులు మాత్రం చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.

సంక్రాంతి సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. పెరిగిన టికెట్ల రేట్ల కారణంగా చాలా మంది థియేటర్లకు వెళ్లాలి అంటే వామ్మో అనే పరిస్థితి ఉంది. అందుకే అన్ని సినిమాలను ఓటీటీ లో చూసేయాలి అనుకునే వారు చాలా మంది ఉన్నారు. అందులో భాగంగానే సైంధవ్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు సైంధవ్‌ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌ లో సైంధవ్ ను స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. గత రాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ మొదలు అయ్యింది. థియేట్రికల్‌ రిలీజ్ స్క్రీనింగ్‌ మిస్ అయిన వారు ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఈ వీకెండ్‌ ను అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్‌ అవుతున్న సైంధవ్ తో గడిపేందుకు చాలా మంది రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది.

తండ్రి కూతురు సెంటిమెంట్‌ తో పాటు వెంకటేష్ మార్క్ యాక్షన్‌ సన్నివేశాలు సినిమాలో ప్రధానంగా ఉంటాయి. అయితే వెంకీ మార్క్ ఎంటర్‌ టైనర్‌ లేకపోవడం ఒక లోటు గా చెప్పుకోవచ్చు. థియేట్రికల్ స్క్రీనింగ్ లో నిరాశ పరిచిన సైంధవ్ ఓటీటీ స్ట్రీమింగ్ లో ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటాడో చూడాలి.