Begin typing your search above and press return to search.

ఆ ఒక్క రోజు బడా సినిమాల అప్డేట్స్ జాతర.. గెట్ రెడీ!

ఏప్రిల్ 9న ఉగాది తెలుగు ప్రజలకి ప్రత్యేకమైన పండగ అన్న సంగతి తెలిసిందే. ఉగాదితోనే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది.

By:  Tupaki Desk   |   5 April 2024 4:50 AM GMT
ఆ ఒక్క రోజు బడా సినిమాల అప్డేట్స్ జాతర.. గెట్ రెడీ!
X

ఏప్రిల్ 9న ఉగాది తెలుగు ప్రజలకి ప్రత్యేకమైన పండగ అన్న సంగతి తెలిసిందే. ఉగాదితోనే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. అందుకే తెలుగు ప్రజలు అందరూ ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం కొత్త సినిమాలకి సంబందించిన అప్డేట్స్, అలాగే ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న సినిమాల స్పెషల్ పోస్టర్స్, వీడియోలు రిలీజ్ కూడా ఉగాది రోజు ఉంటాయి.

ఈ సారి ఉగాది పర్వదినం రోజున ఏ సినిమాలకి సంబందించిన అప్డేట్స్ వచ్చే అవకాశం ఉందో ఓ సారి చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో చేస్తోన్న విశ్వంభర నుంచి గ్లింప్స్ ని ఉగాది సందర్భంగా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంట. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా సుస్మిత కొణెదల, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే సినిమాకి సంబంధించి అప్డేట్ రావొచ్చని టాక్ వినిపిస్తోంది.

బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రెడీ అవుతోన్న సినిమా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం ఉందంట. అలాగే బోయపాటి దర్శకత్వంలో చేయబోయే అఖండ సీక్వెల్ పై అఫీషియల్ అప్డేట్ ఉగాది రోజు రావొచ్చని అంటున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో బాలయ్య చేయబోయే సినిమాపై అఫీషియల్ కన్ఫర్మేషన్ పోస్టర్ వస్తుందని సమాచారం. ఒక విధంగా బాలయ్య తెలుగు న్యూ ఇయర్ రోజు ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇవ్వనున్నట్లు అర్ధమవుతోంది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున కాంబినేషన్ లో కుభేర మూవీ తెరకెక్కుతోంది. తమిళంలో మరో సినిమా వీరిద్దరి కాంబోలో కన్ఫర్మ్ అయ్యిందంట. ఈ సినిమాకి సంబందించిన అప్డేట్ రావోచ్చనే మాట వినిపిస్తోంది. అలాగే సోగ్గాడే చిన్ని నాయన సిరీస్ లో పార్ట్ ౩ పైన కూడా ఉగాది రోజున కన్ఫర్మేషన్ రావొచ్చని టాక్. వెంకటేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మూవీ కన్ఫర్మ్ అయ్యింది.

దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం అనే వర్కింగ్ టైటిల్ తో ఉగాది రోజున ఎనౌన్స్మేంట్ ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాల మాట. అలాగే గేమ్ చేంజర్, దేవర సినిమాల నుంచి ఉగాది విషెస్ పోస్టర్స్ రావొచ్చని టాక్. దాంతో పాటు పవన్ కళ్యాణ్ చేస్తోన్న మూవీస్ నుంచి కూడా ఉగాది స్పెషల్ పోస్టర్స్ వస్తాయనే ప్రచారం నడుస్తోంది.

ఇక మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్టుపై కూడా ఆ పండగ రోజు ఏదైనా అప్డేట్ ఇస్తారా అని ఫ్యాన్స్ అయితే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో బిగ్ యాక్షన్ అడ్వెంచరస్ గా రూపొందనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధమైనట్లు సమాచారం. ఇక మహేష్ బాబుతో రెండు నెలల వర్క్ షాప్ ఉండబోతోందట. ఇక సమ్మర్ అనంతరం రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.