ఆ విషయంలో ఇండస్ట్రీలో పెద్ద సిండికేటే ఉంది
చాలా కాలం తర్వాత ఇప్పుడు ఉదయ భాను రీసెంట్ గా ఓ మూవీ ఈవెంట్ ను హోస్ట్ చేశారు.
By: Tupaki Desk | 11 July 2025 1:03 PM ISTప్రస్తుతం బుల్లితెర యాంకర్ గా స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్నదెవరంటే క్షణం ఆలోచించకుండా ఎవరైనా సరే సుమ పేరు చెప్పేస్తారు. ఆ తర్వాత అనసూయ, రష్మి కూడా ఈ రేసులో ఉన్నారు. అయితే ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న వారిలో ఉదయభాను కూడా ఒకరు. ఎన్నో కార్యక్రమాలతో ఆడియన్స్ ను అలరించారు ఉదయభాను.
హృదయాంజలి అనే ప్రోగ్రామ్ తో ఆడియన్స్ ను పలకరించిన ఉదయ భాను తన మాటలతో, అందంతో, చలాకీదనంతో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నారు. మొదటి ప్రోగ్రామ్ తోనే ఆడియన్స్ నుంచి ఉదయ భాను కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఎన్నో ప్రోగ్రామ్స్ కు యాంకర్ గా వ్యవహరించి చాలా పాపులరైన ఉదయ భాను కు ఇప్పుడు అవకాశాలు తగ్గాయి.
చాలా కాలం తర్వాత ఇప్పుడు ఉదయ భాను రీసెంట్ గా ఓ మూవీ ఈవెంట్ ను హోస్ట్ చేశారు. ఈ ఈవెంట్లో ఉదయభాను చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఓ భామ అయ్యో రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఉదయ భాను హోస్ట్ చేయగా, ఆ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్ విజయ్ కనకమేడల చాలా రోజుల తర్వాత ఉదయభాను గారు యాంకరింగ్ చేస్తున్నారన్నారు.
దానికి ఉదయభాను స్పందిస్తూ ఇదొక్కటే చేశాననీ, మళ్లీ చేస్తానో లేదో కూడా గ్యారెంటీ లేదని, రేపే ఈవెంట్ అనుకుంటాం కానీ తీరా ఆ రోజు వచ్చేసరికి మనకు ఈవెంట్ ఉందదని, ఇండస్ట్రీలో అంత పెద్ద సిండికేట్ ఎదిగిందని, సుహాస్ మా బంగారం కాబట్టి ఈ ఈవెంట్ చేయగలిగానని, మనసులో మాట కాబట్టే చెప్తున్నానని ఆమె అన్నారు. ఆ తర్వాత యాక్టర్ మచ్చ రవి మాట్లాడుతూ ఉదయభాను మైక్ పట్టుకుంటే ఒక నారి వంద తుపాకుల టైప్ అన్నారు. దానికి స్పందిస్తూ నాకు చాలా బుల్లెట్లు తగిలాయి కానీ అదెవరికీ తెలియదని నవ్వుతూనే ఆన్సరిచ్చారు ఉదయ భాను. కాగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైలరవుతున్నాయి.
