150 కట్స్ తో సంచలన చిత్రం రిలీజ్!
రాజస్థాన్ ఉదయ్ పూర్ లో జరిగిన 'టైలర్ కన్హయ్య లాల్' హత్య అప్పట్లో దేశ వ్యాప్తంగా ఎంత సంచల నమైందో తెలిసిందే.
By: Tupaki Desk | 11 July 2025 12:00 AM ISTరాజస్థాన్ ఉదయ్ పూర్ లో జరిగిన 'టైలర్ కన్హయ్య లాల్' హత్య అప్పట్లో దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. ఇద్దరు దుండగులు అత్యంత కర్కశంగా కన్హయ్య లాల్ తల నరికి చంపడంపై దేశమంతా భగ్గుమంది. ఈ ఘటన ఆధారంగానే భరత్ త్రినేట్ 'ఉదయ్ పూర్ పైల్స్' టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో మంచి హైప్ క్రియేట్ అయింది.
అయితే ఈ సినిమా ఆదిలోనే వివాదాలతోనూ అట్టుడుకుతుంది. ఇప్పటికే సినిమాపై ముస్లీం సంఘల నుంచి వ్యతిరకత వ్యక్తమవుతోంది. సినిమా నిలిపివేయాలని జమేతే ఇ ఇస్లామి డిమాండ్ చేస్తోంది. ఈ సినిమా ద్వారా ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సినిమా రిలీజ్ అయితే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. సమాజ్ వాజ్ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్వీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసారు.
సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఓటీటీలో కూడా రిలీజ్ చేయకూడదనే డిమాండ్ వ్యక్త మవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా సెన్సార్ నుంచి సినిమాపై చాలా అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో పాటు దాదాపు 150 కట్స్ కూడా పడ్డట్లు తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో రిలీజ్ అవుతున్న సినిమా నుంచి 150 సన్నివేశాలు తొలగించారు. కట్స్ అనంతరం కొత్త వెర్షన్ తో రిలీజ్ అవుతుంది.
ఈ నేపథ్యంలో దర్శకుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఉదయ్ పూర్ పైల్స్ మతానికో? విశ్వాసాని కో సంబంధించిన కథ కాదు. భావజాలం, సత్యం గు రించి మాత్రమే సినిమాలో ఉంటుంది. ఎవరి మనో భావాలను దెబ్బ తీసే కంటెంట్ సినిమాలో ఉండదు. అందరూ చూడాల్సిన సినిమాగా పేర్కొన్నారు. ఇం దులో కన్హయ్య లాల్ పాత్రలో విజయ్ రాజ నటిస్తున్నారు. దుగ్గల్, రజనీష్, ప్రీతి ఘుంగియానీ, కమ లేష్, సావంత్, కంచి సింగ్, ముస్తాక్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమీత్ జానీ ఈ చిత్రాన్ని నిర్మి స్తున్నారు.
ప్రతి సినిమాలో ఏదో ఒక రకమైన రాజకీయాలు ఉంటాయి. కొన్ని సున్నితమైన మరియు వివాదాలకు దారి తీసే అంశాలను కవర్ చేస్తాయి. అలాంటి ఇటీవలి చిత్రం ఉదయపూర్ ఫైల్స్: కన్హయ్య లాల్ టైలర్ మర్డర్. ఉదయపూర్‌కు చెందిన దర్జీ కన్హయ్య లాల్ యొక్క నిజమైన కథ ఆధారంగా, ఈ చిత్రం 2022లో అతని దారుణ హత్యకు దారితీసిన సంఘటనలను ట్రాక్ చేస్తుంది. దీనికి భరత్ శ్రీనేట్ దర్శకత్వం వహించగా, అమిత్ జాని నిర్మించారు.
