Begin typing your search above and press return to search.

సెల‌బ్రిటీ వివాహాల‌కు ఉద‌య్ పూరే ఎందుకు?

సినిమా సెలబ్రిటీలైనా? వ్యాపార దిగ్గజాలైనా? తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన వివాహ వేడుక కోసం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ నగరాన్నే మొదటి ఛాయిస్‌గా ఎంచుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   17 March 2026 5:00 AM IST
సెల‌బ్రిటీ వివాహాల‌కు ఉద‌య్ పూరే ఎందుకు?
X

సినిమా సెలబ్రిటీలైనా? వ్యాపార దిగ్గజాలైనా? తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన వివాహ వేడుక కోసం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ నగరాన్నే మొదటి ఛాయిస్‌గా ఎంచుకుంటున్నారు. ఇటీవలే విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న వివాహం అక్క‌డే జ‌రిగింది. అంతకుముందు పరిణీతి చోప్రా - రాఘవ్ చద్దా పెళ్లి వేదిక అదే.ఇంకా ఎంతో మంది సెల‌బ్రిటీల డెస్టినేష‌న్ వెడ్డింగ్ స్పాట్ ఏదంటే? ఉద‌య్ పూర్ మాత్ర‌మ‌నే చెప్పాలి.అసలు దేశంలో ఇన్ని అందమైన నగరాలు ఉండగా? సెలబ్రిటీలు ఉదయ్‌పూర్ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? అక్కడ అంత ప్రత్యేకత ఏముంది? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

ఉదయ్‌పూర్ అనగానే మొదట గుర్తొచ్చేది అద్భుతమైన రాజ‌భ‌వ‌నాలు, సరస్సులు. పిచోలా సరస్సు మధ్యలో ఉండే `తాజ్ లేక్ ప్యాలెస్` లేదా ఒడ్డున ఉండే `ది లీలా ప్యాలెస్`, `ఉదయ్‌ విలాస్` వంటివి ప్రపంచ స్థాయి విలాసాలకు పెట్టింది పేరు. ఇక్కడి కోటలు, రాజభవనాల ఆర్కిటెక్చర్ ప్రతి వివాహ వేడుకను ఒక రాయల్ ఫెయిరీ టేల్ లా మార్చేస్తాయి. ఈ రాజసం మరే ఇతర నగరంలోనూ దొరకదు. అందుకే సెలబ్రిటీలంతా వివాహాల కోసం ఇక్కడికే క్యూ కడుతుంటారు.సెలబ్రిటీల వివాహ అంటే ఆ సమయంలో ప్రైవసీ చాలా కీల‌కం.

ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్ హోటళ్లు చుట్టూ సరస్సులలు, కొండలతో ఆవరించి ఉండటం వల్ల బయటి వ్యక్తులు లేదా మీడియా కంట పడకుండా వేడుకలు జరుపుకోవడం సులభం అవుతుంది. ముఖ్యంగా జగ్‌మందిర్ ఐలాండ్ ప్యాలెస్ వంటి ప్రదేశాలు కేవలం పడవల ద్వారా మాత్రమే చేరుకునేలా ఉండటం వల్ల, అక్కడ గట్టి భద్రతను ఏర్పాటు చేయడం నిర్వాహకులకు సులభమవుతుంది. తమ ప్రైవేట్ స్పేస్ లో ఎంతో స్వేచ్ఛగా గడపడానికి వీలుంటుంది. అందుకే స్టార్లు ఉదయ్‌పూర్‌ను అమితంగా ఇష్టపడతారు. ఉదయ్‌పూర్ కేవలం అందమైన లొకేషన్ మాత్రమే కాదు. అది రాజస్థానీ సంస్కృతికి , ఆతిథ్యానికి చిరునామా.

పెళ్లికి వచ్చే అతిథులకు ఇచ్చే రాజమర్యాదలు, సాంప్రదాయ ఘూమర్ డ్యాన్స్‌లు, ఫోక్ మ్యూజిక్ నోరూరించే రాజస్థానీ వంటకాలు వేడుకకు విలక్షణమైన గుర్తింపును ఇస్తాయి. ఆధునిక సౌకర్యాలు , పాతకాలపు రాజసాన్ని కలగలిపి అందించడంలో ఉదయ్‌పూర్ హోటళ్లు ప్రపంచంలోనే అత్యుత్తమ రేటింగ్స్‌ను కలిగి ఉన్నాయి.

ఫోటోగ్రఫీ , విజువల్స్ విషయంలో ఉదయ్‌పూర్‌కు సాటిలేదని చెప్పాలి. ఇక్కడి సూర్యాస్తమయాలు, సరస్సు నీటిలో ప్రతిబింబించే కోటల వెలుగులు వెడ్డింగ్ ఆల్బమ్స్‌కు అద్భుతమైన బ్యాక్‌డ్రాప్‌ను ఇస్తాయి.

ముఖ్యంగా డ్రోన్ షాట్స్ , సినిమాటిక్ వెడ్డింగ్ వీడియోల కోసం లొకేషన్లు కలర్‌ఫుల్‌గా ఉంటాయి. అందుకే సెలబ్రిటీలు తమ జీవితకాల జ్ఞాపకాలను అత్యంత అందంగా భద్రపరుచుకోవడానికి సిటీ ఆఫ్ లేక్స్ ను వేదికగా చేసుకుంటారు. అలాగే ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకోవడం అనేది స్టేటస్ సింబల్ గానూ మారింది. ఎంత ఖర్చయినా సరే జీవితంలో ఒక్కసారి చేసుకునే పెళ్లి రాజవంశీయుల స్థాయిలో జరగాలనే కోరికతో సెలబ్రిటీలు ఉదయ్‌పూర్‌ను తమ కలల వివాహ వేదికగా మార్చుకుంటున్నారు.