Begin typing your search above and press return to search.

టైసన్ నాయుడు.. ఏం జరుగుతోంది?

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా పదేళ్ల క్రితం యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 April 2024 3:30 AM GMT
టైసన్ నాయుడు.. ఏం జరుగుతోంది?
X

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా పదేళ్ల క్రితం యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫస్ట్ మూవీ అల్లుడు శీనుతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత స్పీడున్నోడు, సాక్ష్యం, అల్లుడు అదుర్స్, సీత, కవచం వంటి చిత్రాలు చేసినా.. అవి బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. మధ్యలో జయ జానకీ నాయక, రాక్షసుడు సినిమాలు హిట్‌ టాక్ అందుకున్నాయి.

ఇక ప్రభాస్ నటించిన ఛత్రపతి మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేసి.. ఘోర పరాజయాన్ని చవి చూశారు శ్రీనివాస్. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కే చంద్రతో టైసన్ నాయుడు సినిమా చేస్తున్న శ్రీనివాస్.. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్‌, మూన్‌షైన్ పిక్చర్స్‌ సంస్థలతో చెరో మూవీ చేయనున్నారు.

అయితే టైసన్ నాయుడు సినిమా విషయానికొస్తే.. 14 రీల్స్ బ్యాన‌ర్‌ పై భారీ బడ్జెట్‌ తో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. కొన్ని నెలల క్రితం బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అందులో శ్రీనివాస్ ను మాస్ అవతార్ లో చూపించారు. ఫుల్ యాక్షన్ స్టంట్స్ తో బెల్లంకొండ అదరగొట్టేశారు. పవర్ ఫుల్ డీఎస్పీగా శ్రీనివాస్ ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు.

కానీ ఇప్పటివరకు మళ్లీ ఎలాంటి అప్డేట్ రాలేదు. రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదు. షూటింగ్ ఎందుకింత ఆలస్యం అవుతుందో తెలియడం లేదు. ఈ ప్రాజెక్టుకు బడ్జెట్ సమస్య ఉన్నట్లు, అందుకే షూటింగ్ లేట్ అవుతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అదే ఇష్యూతో బాలయ్య- బోయపాటి సినిమా కూడా 14 రీల్స్ సంస్థ ఇంకా పట్టాలెక్కించలేదని ఇండస్ట్రీలో తెగ గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక నిన్ననే.. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై బెల్లంకొండ చేయనున్న సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. హారర్‌ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ మూవీకి కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. లైట్‌ వర్సెస్‌ డార్క్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరూ హారర్, థ్రిల్లర్ చిత్రాలపైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి బెల్లంకొండ తన కొత్త సినిమాలతో ఎలాంటి హిట్లు కొడతారో చూడాలి.