Begin typing your search above and press return to search.

ఒకే కథతో ఇద్దరు హీరోయిన్స్

తెలుగులో అయితే ఒకప్పుడు విజయశాంతి విమెన్ హీరోయిజంతో సినిమాలు చేసి సక్సెస్ లు అదుకుంది.

By:  Tupaki Desk   |   5 Jun 2024 3:38 AM GMT
ఒకే కథతో ఇద్దరు హీరోయిన్స్
X

ఈ మధ్యకాలంలో హీరోయిన్ సెంట్రిక్ కథలతో వచ్చే సినిమాలకు ఆదరణ ఎక్కువ లభిస్తోంది. బాలీవుడ్ లో ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ సక్సెస్ లు అందుకుంటాయి. అయితే సౌత్ లకు వచ్చేసరికి ఫిమేల్ సెంట్రిక్ కథలతో ఉమెన్ ఓరియంటెడ్ మూవీస్ చాలా తక్కువగా వస్తుంటాయి. తెలుగులో అయితే ఒకప్పుడు విజయశాంతి విమెన్ హీరోయిజంతో సినిమాలు చేసి సక్సెస్ లు అదుకుంది.

ఆ తర్వాత విజయశాంతి స్థాయిలో టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా ఎవరు కూడా గుర్తింపు తెచ్చుకోలేదు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాస్త కంటెంట్ బేస్డ్ కథలకు ప్రాధాన్యత పెరగడంతో విమెన్ సెంట్రిక్ మూవీస్ ని దర్శక, నిర్మాతలు చేస్తున్నారు. ఈ వారం ఇద్దరు హీరోయిన్స్ నుంచి 2 విమెన్ ఓరియెంటెడ్ మూవీస్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో తెరకెక్కిన సత్తిబాబు రిలీజ్ అవుతోంది.

అలాగే పాయల్ రాజ్ పుత్ నుంచి రక్షణ అనే మూవీ రాబోతుంది. అయితే ఈ రెండు సినిమాలు కథలు ఇంచుమించు ఒకటే కావడం విశేషం. కాజల్ అగర్వాల్, పాయల్ రాజ్ పుత్ ఇద్దరు కూడా వారి సినిమాలలో పోలీస్ ఆఫీసర్లు గానే నటించారు. అలాగే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్ లోని ఈ రెండు సినిమాలు రాబోతున్నాయి. సత్యభామ మూవీ ఈ మధ్యకాలంలోనే తెరకెక్కింది. రక్షణ సినిమా పాయల్ రాజ్ పుత్ ఆరేళ్ళ క్రితం చేసింది. ఈ ఒక్క వ్యత్యాసం తప్ప ఈ సినిమా కథ, బ్యాక్ డ్రాప్ అంతా ఒకటే కావడం విశేషం.

జూన్ 7న ఈ రెండు సినిమాలు ఒకే రోజు థియేటర్స్ లోకి వస్తున్నాయి. సత్యభామ ట్రైలర్ పరంగా కాస్తా పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది. కాజల్ అగర్వాల్ కూడా సినిమాని దగ్గరుండి ప్రమోట్ చేస్తోంది. ఈ మూవీతో సక్సెస్ అందుకొని మళ్ళీ అవకాశాలు పెంచుకోవాలని కాజల్ అగర్వాల్ భావిస్తోంది. అయితే రక్షణ సినిమా వివాదాల నడుమ ప్రొడ్యూసర్ కౌన్సిల్ వరకు వెళ్లి రిలీజ్ కాబోతోంది.

మరి ఆడియన్స్ ఈ రెండింటిలో దేనిని చూడటానికి ఇష్టపడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు హీరోయిన్స్ కూడా కూడా వారి సినిమాలు సక్సెస్ అయితే మళ్ళీ ఛాన్స్ లు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ విమేన్ సెంట్రిక్ మూవీస్ సక్సెస్ అయితే మరికొంత మంది దర్శకులు భవిష్యత్తులో విమేన్ బేస్డ్ స్టోరీస్ తో సినిమాలు చేయడానికి ప్రయత్నించే ఛాన్స్ ఉంటుంది.