Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్ కోసం ఇద్దరు అందాల అతిథులు...!

సీతారామం, హాయ్‌ నాన్న సినిమాలతో వరుస హిట్స్ ను దక్కించుకున్న మృణాల్‌ ఠాకూర్‌ ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా నటించింది.

By:  Tupaki Desk   |   5 March 2024 11:30 PM GMT
ఫ్యామిలీ స్టార్ కోసం ఇద్దరు అందాల అతిథులు...!
X

రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ వచ్చే నెలలో ఫ్యామిలీ స్టార్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సీతారామం, హాయ్‌ నాన్న సినిమాలతో వరుస హిట్స్ ను దక్కించుకున్న మృణాల్‌ ఠాకూర్‌ ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా నటించింది. తాజాగా విడుదల అయిన టీజర్‌ ఆకట్టుకుంటోంది.


ఈ సినిమాలో మృణాల్‌ ఠాకూర్ కాకుండా మరో ఇద్దరు ముద్దుగుమ్మలు కనిపించబోతున్నట్లు సమాచారం అందుతోంది. చాలా రోజులుగా ఫ్యామిలీ స్టార్‌ కోసం గెస్ట్‌ గా శ్రీ వల్లి రష్మిక మందన్న కనిపించబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు దాదాపుగా నిజమే అన్నట్లుగా యూనిట్‌ సభ్యులు ఆఫ్‌ ది రికార్డ్‌ ఒప్పేసుకున్నారు.

రష్మిక ఫ్యామిలీ స్టార్‌ కోసం డాన్స్ చేసిందా లేదంటే ఏదైనా కీలక పాత్రలో కనిపించబోతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు మరో హీరోయిన్‌ దివ్యాంశ కౌశిక్ కూడా ఫ్యామిలీ స్టార్‌ లో గెస్ట్‌ రోల్‌ లో కనిపించబోతుంది అంటూ సమాచారం అందుతోంది.

సినిమాలో దివ్యాంశ కౌశిక్ పాత్ర కూడా గెస్ట్ రోల్‌ అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరి గెస్ట్‌ రోల్‌ ఎంత వరకు ప్రేక్షకులకు సర్‌ప్రైజింగ్ గా ఉంటుంది అనేది చూడాలి. మజిలీ సినిమాతో పాటు రామారావు ఆన్ డ్యూటీ మరియు మైఖేల్ సినిమాల్లో నటించిన దివ్యాంశ కౌశిక్‌ ఫ్యామిలీస్టార్‌ లో గెస్ట్‌ గా కనిపించబోతున్న నేపథ్యంలో మరికొన్ని ఆఫర్లు ఏమైనా దక్కించుకుంటుందేమో చూడాలి.

పరశురామ్ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాను ఏప్రిల్‌ 5న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదల చేయాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్‌ ఆలస్యం అవ్వడం, ఆ తర్వాత సరైన విడుదల తేదీ లేకపోవడంతో ఏప్రిల్‌ 5న విడుదల చేయబోతున్నారు.