Begin typing your search above and press return to search.

నా పిల్ల‌లు లేచిపోతేనే బెట‌ర‌న్న న‌టి

ఈ వ్యాఖ్య వాస్త‌విక ప్ర‌పంచంలోని పెళ్లిళ్ల పోక‌డ‌- ఆర్భాటంపై సెటైర్ అని కూడా భావించాల్సి ఉంటుంది. ఇంత‌కీ ట్వింకిల్ ఏమ‌ని వ్యాఖ్యానించారు? అంటే....

By:  Tupaki Desk   |   11 March 2024 3:30 PM GMT
నా పిల్ల‌లు లేచిపోతేనే బెట‌ర‌న్న న‌టి
X

కొన్నిసార్లు వేదిక‌ల‌పై వ్యాఖ్య‌లు మొర‌టుగా ఉన్నా కానీ.. వాటిలోని వాస్త‌విక‌త‌ను డెప్త్ ను అర్థం చేసుకుంటే చాలా ఆశ్చ‌ర్యం క‌ల‌గుతుంది. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కం పుస్త‌క ర‌చ‌యిత‌ ట్వింకిల్ ఖ‌న్నా అనూహ్య‌ వ్యాఖ్య ఆలోచింప‌జేస్తోంది. ఈ వ్యాఖ్య వాస్త‌విక ప్ర‌పంచంలోని పెళ్లిళ్ల పోక‌డ‌- ఆర్భాటంపై సెటైర్ అని కూడా భావించాల్సి ఉంటుంది. ఇంత‌కీ ట్వింకిల్ ఏమ‌ని వ్యాఖ్యానించారు? అంటే....

త‌మ పిల్ల‌ల‌కు పెళ్లి చేయ‌డం కంటే వారు లేచిపోతేనే ఉత్త‌మ‌మ‌ని ట్వింకిల్ ఖ‌న్నా వ్యాఖ్యానించారు. అంబానీల ఇంట పెళ్లి త‌ర్వాత సెల‌బ్రేష‌న్స్ ప్ర‌మాణాలు అమాంతం పెరిగాయి. నేను నీతా భాబిలా డ్యాన్సులు చేయ‌లేను. ప్ర‌య‌త్నించి కాలు విర‌గ్గొట్టుకున్నా. నా భ‌ర్త (అక్ష‌య్ కుమార్) 10గం.ల త‌ర్వాత మెల‌కువ‌గా ఉండ‌లేడు. అందుకే నేను బావుండాల‌ని పిల్ల‌లు కోరుకుంటే, వారు ఇంట్లోంచి పారిపోతేనే ఉత్త‌మం" అని ట్వింకిల్ వ్యాఖ్యానించారు. ఇది ఎబ్బెట్టుగా ఉన్నా కానీ, ఇప్ప‌టి ఒత్తిళ్ల జీవితాన్ని, బ‌తుకు వెత‌ల్ని కూడా ఇది రివీల్ చేస్తోంది.

రచయిత్రిగా మారిన ట్వింకిల్ ఖన్నా తన సోదరి రింకే ఖన్నాతో సంభాషణలో తన పిల్లల పెళ్లిళ్ల గురించి వ్యాఖ్యానించింది. పెళ్లి తర్వాత కూతురు నితారా ఇంటిపేరు మార్చుకుంటుందేమో అని ట్వింకిల్ ఆలోచిస్తోందట‌. "మా ఇద్దరికీ కుమార్తెలు ఉన్నారు.. వారు వివాహం చేసుకున్న తర్వాత వారి చివరి పేర్లను మార్చుకుంటారా, అద‌నంగా జోడిస్తారా అని ఆశ్చర్యపోతున్నాము. ఈ ప్రశ్నలు మా కొడుకుల గురించి తలెత్తవు. మేము ఎప్పుడూ మా అమ్మాయిల గురించి కాకుండా మా కొడుకుల గురించి ఎక్కువగా ఆందోళన చెందుతాము. ట్యూషన్ సార్ వచ్చినప్పుడు గది తలుపు తెరిచి ఉంచడం.. స్కూల్ బస్సులో ఒక మహిళా చాపెరోన్ ఉండేలా చూసుకోవడం.. వీటన్నిటితో పాటు, వారికి జాగ్రత్తగా ఉండమని ..ప్రపంచానికి భయపడకుండా ఉండటం ఎలానో నేర్పించడం ప్ర‌య‌త్నిస్తున్నాం" అని తెలిపారు.

ట్వింకిల్ 17 జనవరి 2001న అక్షయ్ కుమార్ ని వివాహం చేసుకున్నారు. వారికి ఆరవ్ అనే కుమారుడు , నితారా అనే కుమార్తె ఉన్నారు. ట్వింకిల్ 1995లో బర్సాత్‌తో తెర‌కు ప‌రిచ‌య‌మైంది. పలు చిత్రాలలో నటించిన తర్వాత 2001లో నటనకు స్వస్తి చెప్పింది. ఇటీవ‌ల పుస్త‌క‌ర‌చ‌యిత‌గా సంఘంలో గొప్ప పేరు తెచ్చుకుంటోంది.