Begin typing your search above and press return to search.

నేను సూప‌ర్ ఉమెన్‌ని పెళ్లాడాను

2022లో ట్వింకిల్ ఖన్నా ''గోల్డ్ స్మిత్స్, యూనివర్సిటీ ఆఫ్ లండన్‌''లో తన మాస్టర్స్ ఇన్ ఫిక్షన్ రైటింగ్‌ను కొనసాగించింది

By:  Tupaki Desk   |   17 Jan 2024 5:00 AM GMT
నేను సూప‌ర్ ఉమెన్‌ని పెళ్లాడాను
X

2022లో ట్వింకిల్ ఖన్నా ''గోల్డ్ స్మిత్స్, యూనివర్సిటీ ఆఫ్ లండన్‌''లో తన మాస్టర్స్ ఇన్ ఫిక్షన్ రైటింగ్‌ను కొనసాగించింది. 2023లో తన డిగ్రీని పూర్తి చేసింది. ట్వింకిల్ ఇటీవ‌ల పుస్త‌క ర‌చ‌యిత‌గా పాపుల‌ర‌వుతున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్త‌యిన‌ తర్వాత ట్వింకిల్ భర్త అక్షయ్ కుమార్ ఆమెకు అతిపెద్ద చీర్‌లీడర్‌గా మారారు. అతడు తమ సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ ఒక అంద‌మైన‌ నోట్‌ను కూడా రాశాడు.


అక్షయ్ ట్వింకిల్‌ను ప్రశంసిస్తూ ఇలా మురిసిపోయాడు. రెండేళ్ల క్రితం మీరు మళ్లీ చదువులు చదవాలనుకుంటున్నాన‌ని నాతో చెప్పినప్పుడు మీ ప్ర‌య‌త్నానికి ఉద్ధేశానికి ఆశ్చర్యపోయాను. కానీ మీరు చాలా కష్టపడి ఇంటిని, కెరీర్ ని బ్యాలెన్స్ చేసారు. న‌న్ను పిల్లలను చూసుకుంటూనే పూర్తి స్థాయి విద్యార్థి జీవితాన్ని మేనేజ్ చేయ‌డం చూశాక‌.. నేను ఒక సూపర్ ఉమెన్‌ని వివాహం చేసుకున్నానని నాకు తెలుసు... అని ఉద్విగ్నంగా స్పందించాడు. ఈ నోట్‌లో ఇంకా చాలా విష‌యాల్ని రాసాడు అక్కీ. ''ఈ రోజు మీ గ్రాడ్యుయేషన్ సందర్భంగా టీనా (ముద్దు పేరు) మీరు నన్ను ఎంత గర్వించే భ‌ర్త‌ను చేసారో చెప్పడానికి తగినన్ని పదాలను తెలుసుకోవడానికి నేను కొంచెం ఎక్కువ చదువుకోవాలనుకుంటున్నాను.. అభినందనలు మై లవ్'' అని అన్నారు.

23 ఏళ్లుగా ట్వింకిల్ ఖన్నా, అక్షయ్ కుమార్ జోడీ వైవాహిక జీవితంలో అన్యోన్య‌త అభిమానుల‌కు స్ఫూర్తిగా నిలుస్తోంది. వారికి ఆరవ్ - నితారా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పదే పదే ఈ ఇద్ద‌రూ అభిమానుల‌కు ప్రధాన జంట లక్ష్యాలను నిర్దేశిస్తారు.. ఒకరికొకరు అతిపెద్ద ఛీర్‌లీడర్‌లుగా ప్ర‌జ‌ల‌ గుండెల్లో నిలిచారు.

అక్షయ్ కుమార్ ఎట్టకేలకు మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మూవీ 'వెల్‌కమ్ 3' షూట్‌ను ప్రారంభించారు. వెల్‌కమ్ టు ది జంగిల్ అనే టైటిల్ ని దీనికి ఫిక్స్ చేసారు. ఇది ఫ్రాంచైజీలో మూడవ చిత్రం. పరేష్ రావల్, దిశా పటానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్షద్ వార్సీ, సంజయ్ దత్, సునీల్ శెట్టి, జానీ లివర్, శ్రేయాస్ తల్పాడే , తుషార్ కపూర్ త‌దిత‌రులు నటించనున్నారు. సెట్స్ నుండి ఇటీవ‌ల అక్కీ ఒక వీడియోను షేర్ చేయ‌గా వైర‌ల్ అయింది. వెల్‌కమ్ బ్యాక్ టు ది జంగిల్ చిత్రానికి అహ్మద్ ఖాన్ ద‌ర్శ‌కుడు. ఫిరోజ్ నడియాడ్‌వాలా మరియు జ్యోతి దేశ్‌పాండే నిర్మిస్తున్నారు. ఇది క్రిస్మస్ సందర్భంగా 25 డిసెంబర్ 2024న విడుదల కానుంది.