వరల్డ్ రికార్డు కోసం నయా నిర్మాత!
స్టార్ హీరోకి ఒక సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయడానికే సంవత్సరాలు సమయం పడుతుంది.
By: Tupaki Desk | 26 July 2025 1:22 PM ISTస్టార్ హీరోకి ఒక సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయడానికే సంవత్సరాలు సమయం పడుతుంది. అదే నిర్మాత ఒకేసారి రెండు..మూడు సినిమాలు నిర్మిస్తుంటాడు. భారతదేశంలో అన్ని భాషల్లో సినిమాలు నిర్మించిన నిర్మాత ఎవరు? అంటూ మూవీ మోఘల్ రామానాయుడు పేరు చెబుతారంతా. అది ఆ లెజెండరీ నిర్మా తకు మాత్రమే సాధ్యమైంది. ఎంతో మంది నటీనటుల్ని...టెక్నీషియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత ఆయన సొంతం. అంతటి లెజెండరీ నిర్మాతే ఒకేసారి రెండు...మూడు సినిమాలు లాంచ్ చేయలేక పోయారు.
కానీ భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యన్నారాయనణ మాత్రం ఒకేసారి 15 సినిమాల ప్రారంభోత్సంతో వరల్డ్ రికార్డుకు ప్రయత్నిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. భారత స్వాతంత్య్ర దినో త్సవం సందర్భంగా ఆగస్టు 15న ఏకంగా 15 సినిమాలు లాంచ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. హైదరాబాద్ లోని సారధి స్టూడియోకు వేదికగా ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకోబోతుంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి కొంత మంది అతిధులు కూడా ఆహ్వాని స్తున్నారు.
వాళ్లందరి సమక్షంలోనే ఈ వేడుక నిర్వహించి..వాళ్లనే సాక్షాలుగా చూపిస్తానంటూ సత్యనారాయణ తెలిపారు. రామానాయుడు తర్వాత శతాధిక చిత్రాల నిర్మాతగా రెండవ రికార్డు తనదేనని సత్యనారాయణ గుర్తు చేసారు. `ఇంతవరకూ ఎవరూ చేయని సాహసమిది. ఒకేసారి పదిహేను కథలను, పదిహేను సినిమా లుగా, పదిహేను కెమెరాలతో , పదిహేను మంది దర్శకులతో లాంచింగ్ ఎంతో గొప్ప విషయమన్నారు. భారత్ వరల్డ్ రికార్స్డ్, ఫిల్మ్ వరల్డ్ రికార్స్డ్ , టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆస్కార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, యూనిరవ్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో రిజిస్టర్ లో రిజిస్టర్ చేసామన్నారు.
అయితే గతంలో నంతమూరి తారకరామారావు హీరోగా పరిచయం అవుతూ ఒకే రోజున తొమ్మిది చిత్రాలను లాంచ్ చేసారు. కానీ అందులో కొన్ని మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన పేరిట ఉన్న రికార్డులను తుమ్మలపల్లి అన్ని సినిమాలను పూర్తి చేసి రిలీజ్ చేసి బద్దలు కొడతారని ప్రేక్షకులు ఆశీస్తున్నారు.
