ముగ్గురు భామల మధ్య టఫ్ ఫైట్!
ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా? `తుంబాడ్ 2` వంటి బలమైన కంటెంట్ ఉన్న సినిమా తో బాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది.
By: Srikanth Kontham | 1 May 2026 1:44 PM ISTబాలీవుడ్ కల్ట్ క్లాసిక్ చిత్రాలలో `తుంబాడ్` ఒకటి. హారర్ - ఫాంటసీ జానర్‌లో అద్భుతం సృష్టించిన ఈ సినిమాకు సీక్వెల్‌గా `తుంబాడ్ 2` ప్రకటనతో దేశవ్యాప్తంగా అంచనాలు పెంచుతోంది. అయితే రెండో భాగంలో అత్యంత శక్తివంతమైన మహిళా పాత్ర కోసం మేకర్స్ ముగ్గురు అగ్ర హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ , గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మధ్య పాత్ర కోసం గట్టి పోటీ నెలకొందని బి-టౌన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ముగ్గురు భామలకు భారీ ఫాలోయింగ్ ఉంది.
నయనతార `జవాన్` సినిమాతో బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు. `తుంబాడ్` వంటి ఇంటెన్స్ డ్రామాలో ఆమె నటన సినిమాకు ఓ కొత్త రూపాన్ని ఇస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. మరోవైపు కత్రినా కైఫ్ గ్లామర్‌తోనే కాకుండా టైగర్ సిరీస్ వంటి చిత్రాలతో యాక్షన్ , పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలకు తాను సిద్ధమని నిరూపించుకున్నారు. వీరిద్దరికీ ధీటుగా ప్రియాంక చోప్రా పేరు కూడా వినిపించడం తో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా? `తుంబాడ్ 2` వంటి బలమైన కంటెంట్ ఉన్న సినిమా తో బాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. `తుంబాడ్` మొదటి భాగం సాధించిన ఘన విజయం - దానికున్న కల్ట్ స్టేటస్ దృష్ట్యా సీక్వెల్‌లో భాగం కావడం వల్ల కెరీర్‌కు మైలేజ్ పెరుగుతుందని ముగ్గురు భామలు భావిస్తున్నారు. అందుకే ముగ్గురి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోందని తెలుస్తోంది. ఈ క్రేజీ పాత్రను వదులుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని సమాచారం.
దర్శక నిర్మాతలు ఈ పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేస్తారనేది సస్పెన్స్‌గా మారింది. ముగ్గుర్ని మేకర్స్ పరిశీ లించినట్లు సమాచారం. నయనతార అయితే సౌత్ మార్కెట్‌కు కూడా పెద్ద ప్లస్ అవుతుంది. ప్రియాంక అయితే గ్లోబల్ లెవల్లో సినిమాకు గుర్తింపు వస్తుంది. కత్రినా కైఫ్ వైపు మొగ్గు చూపితే సినిమాకు కమర్షియల్ హంగులు అదనంగా తోడవుతాయి. ఇలా ముగ్గురిలో ఎవరిని ఎంచుకున్నా సినిమాకు ఎవరి ప్రత్యేకతే వారిదే. దీంతో మేకర్స్ పాత్రలోని ఇంటెన్సిటీని తట్టుకోగలిగే నటి కోసం ఆడిషన్స్ , లుక్ టెస్టులు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా సీక్వెల్ సినిమాలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మొదటి భాగాన్ని మించిన అనుభూతిని అందించాలంటే నటీనటుల ఎంపిక కీలకం. `తుంబాడ్ 2` కథలో మహిళా పాత్ర కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని అందుకే ఇంతటి అగ్ర తారలను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రేజీ ఆఫర్ ఎవరిని వరిస్తుందోనని సోషల్ మీడియాలో అప్పుడే చర్చలు మొదలయ్యాయి. నయనతార ఫ్యాన్స్, ప్రియాంక ఫ్యాన్స్ , కత్రినా ఫ్యాన్స్ తమ హీరోయిన్ పేరే ఫైనల్ కావాలని కోరుకుంటున్నారు.
`తుంబాడ్ 2` ప్రకటనతోనే సంచలనం సృష్టించింది. ఇప్పుడు హీరోయిన్ల ఎంపికతో మరింత హైప్‌ను పెంచుతోంది. నయనతార, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా వంటి ముగ్గురు దిగ్గజాల మధ్య పోటీ అంటే అది సామాన్యమైన విషయం కాదు. మేకర్స్ తీసుకునే నిర్ణయం సినిమా భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మరి ఈ ముగ్గురు భామల మధ్య జరుగుతోన్న పోరులో అంతిమంగా విజేతగా నిలిచి తుంబాడ్ ప్రపంచంలోకి అడుగుపెట్టే అదృష్టవంతురాలు ఎవరో? త్వరలోనే తెలుస్తుంది.
