వావ్.. ఇడియట్ సౌండ్ తో మాస్ జాతర సాంగ్
మాస్ మహారాజా రవితేజ అభిమానులకు ఓ మ్యూజికల్ ట్రీట్ రెడీగా ఉంది. రవితేజ, శ్రీలీల జంటగా వస్తున్న కొత్త చిత్రం మాస్ జాతర నుంచి ‘తూ మేరా లవర్’ అనే ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదలయ్యింది.
By: Tupaki Desk | 12 April 2025 4:45 PM ISTమాస్ మహారాజా రవితేజ అభిమానులకు ఓ మ్యూజికల్ ట్రీట్ రెడీగా ఉంది. రవితేజ, శ్రీలీల జంటగా వస్తున్న కొత్త చిత్రం మాస్ జాతర నుంచి ‘తూ మేరా లవర్’ అనే ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదలయ్యింది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూలైలో థియేటర్లకు రాబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ పాట ప్రమోకి ఓ ప్రత్యేక హైప్ ఏర్పడింది.
ఎందుకంటే, ఇది 'ఇడియట్' సినిమా నుంచి 'చుపులతో' అనే సాంగ్ ట్యూన్‌ను రీ యూజ్ చేసినట్టు అనిపిస్తోంది. ఇది మ్యూజికల్ రీక్రియేషన్ మాత్రమేనా? లేక అసలు పాటనే తీసుకువచ్చారా? అన్నదానిపై క్లారిటీ రాలేదు కానీ ఈ బజ్ మాత్రం భారీగా నడుస్తోంది. ప్రోమోలో శ్రీలీల తన గ్లామర్ తో స్క్రీన్‌ని బంగారు వెలుగులా మెరిపించింది. రవితేజ ఎప్పటిలాగే ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
ఈ పాటను భీమ్స్ సెసిరోలియో కంపోజ్ చేయగా, మొత్తం పాట ఏప్రిల్ 14న విడుదల కానుంది. ప్రస్తుతం ఇదే టాక్ ట్రాక్‌గా మారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సామజవరగమన సినిమాకు రైటర్‌గా గా వర్క్ చేసిన భాను భోగవరపు ఈ సినిమాతో డైరెక్షన్‌లోకి అడుగుపెడుతున్నాడు. రవితేజ పోలీస్ అవతారంలో మరోసారి మాస్ రోల్ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.
మాస్ జాతర షూటింగ్ దాదాపుగా చివరి దశలో ఉందని టీమ్ వెల్లడించింది. త్వరలోనే ఆఫీషియల్ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవితేజ కెరీర్‌లో మళ్లీ ఓ మాస్ ఫెస్టివల్‌ని తెచ్చే ప్రయత్నంగా ఈ చిత్రాన్ని చూస్తున్నారు. పాట బజ్, ప్రోమో వీడియో, మాస్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక సినిమాను జూన్ లోనే విడుదల చేసే అవకాశం ఉంది. మొదట సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మధ్యలో రవితేజ గాయపడడంతో బ్రేక్ తీసుకు రావాల్సి వచ్చింది. అనంతరం జెట్ స్పీడ్ లో ఫినిష్ చేసి సమ్మర్ మిడ్ లోనే విడుదల చేయాలాని చూసినప్పటికీ వర్కౌట్ కాలేదు. ఇక జూన్ మధ్యలో గ్రాండ్ గా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక న్యూ డేట్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.
