Begin typing your search above and press return to search.

చరణ్ తో ట్రై చేసి విజయ్ తో ఫిక్స్ అవుతున్నాడా..?

ఈ క్రమంలో మరో దర్శకుడు నర్తన్ మన రౌడీ హీరో విజయ్ దేవరకొండతో పనిచేయాలని చూస్తున్నాడట.

By:  Tupaki Desk   |   27 Feb 2024 4:30 PM GMT
చరణ్ తో ట్రై చేసి విజయ్ తో ఫిక్స్ అవుతున్నాడా..?
X

పాన్ ఇండియా సినిమాల జోరులో దర్శకులు హీరోలు ఒక భాషతో సంబంధం లేకుండా పనిచేస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ కె.జి.ఎఫ్ తర్వాత ప్రభాస్ తో సలార్ చేస్తిన విషయం తెలిసిందే. నెక్స్ట్ ఎన్.టి.ఆర్ తో కూడా మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. కన్నడ దర్శకులు కొంతమంది తెలుగు హీరోల మీద ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలో మరో దర్శకుడు నర్తన్ మన రౌడీ హీరో విజయ్ దేవరకొండతో పనిచేయాలని చూస్తున్నాడట.

టాలీవుడ్ లో యూత్ లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురాం తో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత గౌతం తిన్ననూరి సినిమాతో స్పై థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ఈ ఇయర్ సమ్మర్ లో మొదలవుతుందని టాక్. ఇక ఇదే క్రమంలో కన్నడ దర్శకుడు నర్తన్ విజయ్ దేవరకొండ కోసం ఒక స్టోరీ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.

విజయ్ తో స్టోరీ డిస్కషన్స్ కి ట్రై చేస్తున్నాడట. కన్నడ పరిశ్రమల్లో స్టార్ డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న నర్తన్ శివ రాజ్ కుమార్ తో చేసిన మఫ్తీతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. అసలైతే నర్తన్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ కోసం ఒక కథ రెడీ చేశాడు. చరణ్ కు కలిసి కథ కూడా వినిపించాడని టాక్. చరణ్ ముందు అతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించినా తర్వాత వద్దనుకున్నాడట.

ఫైనల్ గా నర్తన్ చరణ్ ఎలాగు ఛాన్స్ ఇచ్చేలా లేడని విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చాడు. విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి సినిమా తర్వాత నర్తన్ తో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. నర్తన్ తో పాటుగా తమిళ దర్శకుడు అరుణ్ మత్తేశ్వరన్ కూడా విజయ్ దేవరకొండ కోసం ఒక స్టోరీ రెడీ చేశాడని టాక్. కన్నడ తమిళ దర్శకులతో పనిచేసేందుకు విజయ్ ఆసక్తి చూపించడంతో అక్కడ నుంచి దర్శకులు విజయ్ తో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి విజయ్ గౌతం తిన్ననూరి సినిమా తర్వాత ఎవరితో కలిసి సినిమా చేస్తాడన్నది తెలియాల్సి ఉంది. ఖుషి సినిమా జస్ట్ ఓకే అనిపించగా ఫ్యామిలీ స్టార్ తో పెద్ద టార్గెట్ పెట్టుకున్న విజయ్ నెక్స్ట్ సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్త పడుతున్నాడని తెలుస్తుంది.