Begin typing your search above and press return to search.

ట్రూ లవర్స్.. వాలెంటైన్స్ వీక్ లో కిక్కిచ్చేలా..

కంటెంట్ ఏ మాత్రం క్లిక్కయినా ఆడియెన్స్ ఎలాంటి బేధాలు లేకుండా సినిమాలకు సపోర్ట్ చేస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

By:  Tupaki Desk   |   9 Feb 2024 8:18 AM GMT
ట్రూ లవర్స్.. వాలెంటైన్స్ వీక్ లో కిక్కిచ్చేలా..
X

కంటెంట్ ఏ మాత్రం క్లిక్కయినా ఆడియెన్స్ ఎలాంటి బేధాలు లేకుండా సినిమాలకు సపోర్ట్ చేస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ ముఖ్యంగా మన తెలుగు ఆడియెన్స్ కు ప్రేమ కథలు టచ్ అవ్వలే గాని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడం పక్కా. ఇక ఇప్పుడు సరైన టైమ్ లో మరో ప్రేమ కథ చిత్రం ఆడియెన్స్ ముందుకు రానుంది. ట్రూ లవర్స్ అనే సినిమా గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో వైబ్ ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


టీజర్ తో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ తో జనాలో మరింత హాట్ టాపిక్ గా నిలిచింది. ఇందులో నటించిన కోలీవుడ్‌ నటుడు మణికందన్ గుడ్ నైట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. గుడ్ నైట్ ఓటీటీ తెలుగు వెర్షన్ బాగా క్లిక్కవడంతో ఇప్పుడు అతను టాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ట్రూ లవర్‌ సినిమాను గుడ్‌ నైట్‌ మేకర్స్‌ నిర్మించగా మాస్‌ మూవీ మేకర్స్‌, మారుతి టీం ప్రొడక్షన్‌ పై మారుతి, సక్సెస్‌ ఫుల్‌ ప్రొడ్యూసర్‌ ఎస్కేఎన్ తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు.

ప్రభురామ్‌ వ్యాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మణికందన్‌ జోడీగా గౌరీప్రియ నటించారు. నేటితరం యువత ప్రేమలో ఎంత త్వరగా మునిగిపోతారో అంతే త్వరగా సమస్యల వలన విడిపోతుంటారు. ఇక అదే పాయింట్ ను దర్శకుడు ట్రూ లవర్ గా చూపించబోతున్నారు. డబ్బు లేని ప్రేమికుడ చివరికి తన ప్రేమను దక్కించుకున్నాడా? లేదా? అనేది ట్రూ లవర్ సినిమా కథ.

చదువు, ఉద్యోగం, ప్రేమ, డబ్బు.. ఇలా జీవితంలో అతి ముఖ్యమైన అంశాలను హైలెట్ చేసినట్లు ట్రైలర్ తోనే క్లారిటీ ఇచ్చారు. ఈ వాలంటైన్స్ వీక్‌ కు ఈ మూవీ సరైన ట్రీట్‌ అని అప్డేట్స్ ద్వారా మంచి బజ్ క్రియేట్ చేశారు. ఇక సక్సెస్ ఫుల్ కాంబినేషన్ ఈ సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్. తప్పకుండా సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఉంటుంది అని ఒక మంచి ప్రేమ కథను చూసిన భావన కలుగుతుంది అని నిర్మాత ఎస్కేన్ తెలియజేశారు.

తెలుగులో ఫిబ్రవరి 10న ఈ సినిమా థియేటర్లో రిలీజ్‌ కానుంది. బేబీ సినిమాలో క్లిక్కయిన లవ్‌ అండ్‌ ఎమోషన్ ఎలిమెంట్స్.. ట్రూ లవర్‌ లోనూ ఉంటాయని అనిపిస్తుంది. ఇక బేబీ లాగా ఈ సినిమా కూడా యూత్‌ కు బాగా కనెక్ట్‌ అయ్యే అవకాశం ఉందని నిర్మాతగా ఎస్కేఎన్ మరో బ్లాక్‌ బస్టర్‌ హిట్ కొట్టడం పక్కా అంటున్నారు నెటిజన్లు. చూడాలి మరి సినిమా ఏ రేంజ్ లో క్లిక్కవుతుందో.