Begin typing your search above and press return to search.

ట్రూ లవర్ టీజర్.. బేబీతో పోలికా?

గత ఏడాది తెలుగులో వచ్చిన బేబీ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాతో వైష్ణవి చైతన్య పెద్ద స్టార్ అయిపొయింది

By:  Tupaki Desk   |   29 Jan 2024 10:18 AM GMT
ట్రూ లవర్ టీజర్.. బేబీతో పోలికా?
X

గత ఏడాది తెలుగులో వచ్చిన బేబీ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాతో వైష్ణవి చైతన్య పెద్ద స్టార్ అయిపొయింది. టీనేజ్ లవ్ స్టొరీగా ఈ జెనరేషన్ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్టుతో మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. యూత్ అయితే బేబీ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రాన్ని ఎస్కేఎన్ నిర్మించి భారీ లాభాలు అందుకున్నారు. ఇదే బ్యానర్ లో ఇప్పుడు ట్రూ లవర్ అనే మరో మూవీ వస్తోంది.

అయితే ఇది తమిళ్ సినిమా కాగా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. గత ఏడాది గుడ్ నైట్ అనే మూవీతో కబాలి ఫేం మణికందన్ హీరోగా ప్రమోషన్ పొందాడు. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ అందుకుంది. ఇప్పుడు అదే హీరో తమిళంలో లవర్ అనే మూవీ చేశాడు. ఈ సినిమాని తెలుగులో ట్రూ లవర్ గా రిలీజ్ చేయబోతున్నారు.

తాజాగా ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ టీజర్ చూస్తుంటే టీనేజర్స్ కి కనెక్ట్ అయ్యే కథాంశంగానే కనిపిస్తోంది. హీరోయిన్ కాలేజీలో హీరోని చూసి ప్రేమలో పడటం, తరువాత అతనికి దగ్గర కావడం. ఈ ప్రయాణంలో మరొకడితో పరిచయం కావడం. హీరోయిన్ ని ప్రేమించిన హీరోకి వాడితో స్నేహం చేయొద్దని వార్నింగ్ ఇవ్వడం, ఇద్దరి మధ్యలో గొడవలు పెరిగి ద్వేషించుకునేంత వరకు వెళ్ళడం ఈ టీజర్ లో చూపించారు.

కామన్ గా టీనేజ్ ప్రేమకథల్లో కనిపించే ఎమోషన్స్ అన్నింటిని ఈ టీజర్ లో డైరెక్టర్ పెట్టి మూవీపైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. టీజర్ బట్టి చూస్తుంటే ఈ సినిమా బేబీ తరహాలోనే యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. సినిమాలో హీరోయిన్ గా చేసిన అందాల భామ రైటర్ పద్మభూషణం, మెయిల్, మ్యాడ్ సినిమాలతో ఇప్పటికే ప్రూవ్ చేసుకుంది.

ట్రూ లవర్ మూవీతో కోలీవుడ్ లోకి పెట్టింది. మోడరన్ లవ్: చెన్నై వెబ్ సిరీస్ లో నటించింది. ఇప్పుడు ట్రూ లవర్ మూవీతో మరోసారి తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించడానికి సిద్ధం అవుతోంది. ఈసినిమా ఆమెకి ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది వేచి చూడాలి. ఈ సినిమాకి మారుతి సమర్పకుడుగా ఉన్నారు.