Begin typing your search above and press return to search.

ట్రూ లవర్.. ఆ ఇద్దరి వల్ల వేరే లెవెల్..!

గుడ్ నైట్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన మణికందన్ లేటేస్ట్ గా లవర్ అనే సినిమాతో రాబోతున్నారు.

By:  Tupaki Desk   |   9 Feb 2024 11:29 AM GMT
ట్రూ లవర్.. ఆ ఇద్దరి వల్ల వేరే లెవెల్..!
X

గుడ్ నైట్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన మణికందన్ లేటేస్ట్ గా లవర్ అనే సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతుంది. సినిమాను తెలుగు, తమిళ భాషల్లో మారుతి, SKN రిలీజ్ చేశారు. ప్రభు రామ్ వ్యాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మణికందన్ సరసన గౌరీ ప్రియా రెడ్డి హీరోయిన్ గా నటించింది. సినిమాలో కన్నా రవి కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు.

ఈ సినిమా తెలుగు ప్రీమియర్స్ కూడా వేస్తారని తెలుస్తుండగా సినిమాను తమిళంలో కూడా ప్రీమియర్స్ వేయగా సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. తమిళంలో కూడా ట్రూ లవర్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా తమిళంలో కూడా మంచి క్రేజ్ తెచ్చుకునేలా ఉంది.

తమిళంలో ప్రీమియర్స్ అయ్యాక ప్రెస్ మీట్ అరేంజ్ చేయగా ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ఈ సినిమా మొదటిసారి చూసి థ్రిల్ అయ్యా.. ట్రూ లవర్ సినిమాను డైరెక్టర్ చాలా బాగా తీశారు. ప్రభు రామ్ వ్యాస్ డైరెక్షన్ టాలెంట్ బాగుందని అన్నారు. అయితే ట్రూ లవర్ కేవలం యూత్ ఆడియన్స్ కి మాత్రమే కాదు ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా అని అన్నారు. ఈ వాలెంటైన్స్ డే కి ఒక మర్చిపోలేని అనుభూతి ట్రూ లవర్ ఇస్తుందని అన్నారు. మణికందన్ గౌరీ ప్రియ పర్ఫార్మెన్స్ లు హైలెట్ గా ఉంటాయని అన్నారు.

హీరో మణికందన్ మాట్లాడుతూ.. అందరికీ థాంక్స్.. తెలుగు ఆడియన్స్ తనని యాక్సెప్ట్ చేసినందుకు సంతోషంగా ఉంది. జై భీం, గుడ్ నైట్ సినిమాలతో కూడా తనకు తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మారుతి, ఎస్.కె.ఎన్ వల్ల అది ఇంకో లెవెల్ కి వెళ్లింది. తమిళ ప్రీమియర్స్ లో లానే తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుందని ఆశిస్తున్నా అన్నారు.