Begin typing your search above and press return to search.

ట్రోల‌ర్స్ అంటే అన‌సూయ‌కి వికారం!

ఆ స‌మ‌యంలో సోష‌ల్ మీడియాకి గుడ్ బై చెప్పేయ‌డం...మ‌ళ్లీ నెట్టింట వైపు చూసేది లేద‌ని సీరియ‌స్ అనేయ‌డం తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 Jan 2024 5:51 AM GMT
ట్రోల‌ర్స్ అంటే అన‌సూయ‌కి వికారం!
X

యాంక‌ర్ క‌మ్ న‌టి అన‌సూయ‌పై నెట్టింట పై ట్రోలింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. నిత్యం ఏదో ఒక‌ అంశం తో అమ్మ‌డు ట్రోలింగ్ గుర‌వుతుంటుంది. ప్ర‌తిగా వాళ్ల‌పై అన‌సూయ ఎటాకింగ్ కూడా అంతే ధీటుగా ఉంటుంది. ఇలాంటి సన్నివేశాలు ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నోసార్లు చోటు చేసుకున్నాయి. ఆ స‌మ‌యంలో సోష‌ల్ మీడియాకి గుడ్ బై చెప్పేయ‌డం...మ‌ళ్లీ నెట్టింట వైపు చూసేది లేద‌ని సీరియ‌స్ అనేయ‌డం తెలిసిందే. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కే మ‌ళ్లీ యాక్టివేట్ అవ్వ‌డం అన్న‌ది చోటు చేసుకుంటుంది.

ఇదంతా అన‌సూయ కెరీర్ లో నిత్య‌కృత్యంగా మారిపోయిన అంశం. తాజాగా అమ్మ‌డిపై జ‌రుగుతోన్న ట్రోలింగ్ పై స్పందించింది. ఇన్ స్టాలో ఓ వ్య‌క్తి అడిగిన ప్ర‌శ్న‌కు బ‌ధులిస్తూ.. `ట్రోల‌ర్స్ అంటే వికార‌మైన జీవులు. వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిని తెలుసుకున్నా. వాళ్ల‌తో అన‌వ‌స‌రంగా స‌మ‌యాన్ని వృద్ధా చేసుకోవాల‌నుకోవ‌డం లేదు` అని అంది. అలాగే బుల్లి తెర‌కు దూర‌మ‌వ్వ‌డంపైనా అమ్మ‌డు తొలిసారి స్పందించింది.

యాంక‌రింగ్ నా కెరీర్ కి ఎంతో ఉప‌యోగ ప‌డింది. అందులో విరామం కావాల‌నిపించింది. అందుకే బ్రేక్ తీసుకున్నా` అని తెలిపింది. అన‌సూయ న్యూస్ రీడ‌ర్ గా కెరీర్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. అటుపై యాంక‌ర్ గా కొత్త ట‌ర్నింగ్ తీసుకుంది. ఇదే అమ్మ‌డి జీవితాన్ని మార్చేసింది. ఎంతో మంది ఫేమ‌స్ యాంక‌ర్ల‌ని సైతం వెన‌క్కి నెట్టి యాంక‌రింగ్ లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. ర‌క‌ర‌కాల షోల‌తో ఎంతో ఫేమ‌స్ అయింది.

అందం..అభిన‌యం కూడా కెరీర్ ఎదుగుద‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా మారాయి. ఈ నేప‌థ్యంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌ల్లో న‌టించే అవ‌కాశాలు అందుకుంది. అటుపై కొన్ని చిత్రాల్లో మెయిన్ లీడ్స్ సైతం చేసింది. ఇప్పుడు అగ్ర హీరోల చిత్రాల్లోనూ కీల‌క పాత్ర‌లు పోషిస్తుంది. అంత బిజీగా ఉన్న‌ప్పుడు మ‌ళ్లీ యాంక‌రింగ్ వైపు ఎందుకొస్తుంది.