Begin typing your search above and press return to search.

నందమూరి వారసుడి కోసం రంగంలోకి త్రివిక్రమ్?

త్రివిక్రమ్ తనయుడి ఎంట్రీ గురించి కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే మోక్షజ్ఞ మొదటి సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించే ఛాన్స్ అయితే కనిపించడం లేదు.

By:  Tupaki Desk   |   5 Dec 2023 4:22 AM GMT
నందమూరి వారసుడి కోసం రంగంలోకి త్రివిక్రమ్?
X

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా గత నెల రోజులుగా గ్యాప్ లేకుండా షూటింగ్లో జరుపుకుంటుంది. ఒకవైపు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మరొకవైపు రెగ్యులర్ షెడ్యూల్ తో త్రివిక్రమ్ చాలా వేగంగా దూసుకుపోతున్నారు.

అయితే ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఒక విషయం ఇండస్ట్రీలో వైరల్ గా మారుతుంది. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ కోసం త్రివిక్రమ్ రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది. ఇటీవల కాలంలో త్రివిక్రమ్ బాలకృష్ణ మధ్యలో అయితే మంచి స్నేహం ఏర్పడింది ఎందుకంటే బాబీ బాలయ్య బాబు చేస్తున్న తదుపరి సినిమాకు కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

ఇక అదే సంస్థతోపాటు త్రివిక్రమ్ సొంత బ్యానర్ ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ కూడా ఒక భాగస్వామ్యం తో కలిసి పనిచేస్తుంది. అయితే ఈ తరుణంలోనే బాలయ్య బాబు త్రివిక్రమ్ కు కూడా మంచి స్నేహం ఏర్పడింది. అప్పుడప్పుడు షెడ్యూల్ కు సంబంధించిన చర్చల్లో త్రివిక్రమ్ కూడా పాల్గొంటున్నారట. ఇక బాలయ్య బాబుతో కూడా ఎక్కువగా మాట్లాడుతున్నారు.

త్రివిక్రమ్ తనయుడి ఎంట్రీ గురించి కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే మోక్షజ్ఞ మొదటి సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించే ఛాన్స్ అయితే కనిపించడం లేదు. కానీ మంచి స్టోరీ మాత్రం సెట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణ తనయుడి మొదటి సినిమా విషయంలో అయితే చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. మంచి కథ ఫైనల్ అయ్యే వరకు కూడా ఎలాంటి అనౌన్స్మెంట్ కూడా ఇవ్వకూడదు అని ఫిక్స్ అయ్యారు.

దర్శకులు చాలామంది కథలు చెబుతున్నారు కానీ ఏది ఆయనకు నచ్చడం లేదు. ఇక త్రివిక్రమ్ ద్వారా ఆయన మంచి కథ దొరుకుతుందేమో అని ఆయన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక త్రివిక్రమైతే గుంటూరు కారం తర్వాత అల్లు అర్జున్తో సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. మరి మోక్షజ్ఞ తేజ కోసం ఆయన కథ విషయంలో సమయాన్ని కేటాయిస్తారో లేదో కాలమే సమాధానం చెప్పాలి. అలాగే మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకు దర్శకుడు ఎవరు సెట్ అవుతారు అనే విషయం కూడా ఆసక్తిని కలిగిస్తోంది.