Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్.. ఆ రెండూ వదిలేయాల్సిందేనా?

అయితే గుంటూరు కారం మూవీ స్టోరీ లైన్.. త్రివిక్రమ్ తీసిన ముందు సినిమాలకు దగ్గరగా ఉందని చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేశారు.

By:  Tupaki Desk   |   7 Feb 2024 12:30 PM GMT
త్రివిక్రమ్.. ఆ రెండూ వదిలేయాల్సిందేనా?
X

సంక్రాంతి కానుకగా వచ్చిన గుంటూరు కారం మూవీతో డైరెక్టర్ త్రివిక్రమ్.. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ రేంజ్ కు తగ్గ సినిమా కాదని మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ట్రోలింగ్ చేశారు. కొన్ని రోజుల పాటు ఎక్కడ చూసినా ఆ ట్రోల్సే కనిపించాయి. మహేశ్ యాక్టింగ్ బాగుందని, త్రివిక్రమ్ స్టోరీ టెల్లింగ్ సెట్ కాలేదని కామెంట్లు చేశారు.

అయితే గుంటూరు కారం మూవీ స్టోరీ లైన్.. త్రివిక్రమ్ తీసిన ముందు సినిమాలకు దగ్గరగా ఉందని చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇదే సినిమాపై నెగిటివిటీ క్రియేట్ అవ్వడానికి కారణమని చెప్పారు. త్రివిక్రమ్ తెరకెక్కించిన గత సినిమాల్లోని పాయింట్లను నెరేట్ చేశారు. జులాయి, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, S/o సత్యమూర్తి సినిమాల్లో ఓ కామన్ పాయింట్ ఉన్నట్లు చెప్పారు..

ఈ నాలుగు చిత్రాల్లో హీరోలు.. ఏదో సాధించడానికి వేరే ఊరు వెళ్తారు. జులాయిలో హీరో దాక్కోవడానికి వెళ్లగా.. అత్తారింటికి దారేదిలో కథానాయకుడు తన అత్తను తీసుకురావడానికి వెళ్తాడు. అజ్ఞాతవాసిలో తండ్రి మరణించాక హీరో ఇంటికి వస్తాడు. ఇక S/o సత్యమూర్తిలో కూడా హీరో వేరే పని మీద ఇంటికి వెళ్తాడు. అదే సమయంలో ఈ చిత్రాలకు సంతకాలతో కూడా లింక్ ఉందని చెప్పారు..

పవన్ అత్తారింటికి దారేదిలో హోటల్ పత్రాలపై హీరో అత్త సంతకం చేసే సీన్ ఉంటుంది. S/o సత్యమూర్తిలో హీరో టార్గెట్ కూడా ఒక డాక్యుమెంట్ పై సంతకం చేయించడమే. ఇక గుంటూరు కారంలో కూడా ఈ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. సిగ్నేచర్ సీన్ తో ఈ సినిమా స్టార్ట్ అవుతోంది. దీంతో త్రివిక్రమ్ గత సినిమాల్లో సీన్లన్నీ ఆడియన్స్ కు గుర్తుకొచ్చాయని చెప్పొచ్చు.

దీంతో చాలా మంది ఈ టాపిక్ పై సోషల్ మీడియాలో డిస్కస్ చేశారు. ఇక త్రివిక్రమ్ త్వరలో అల్లు అర్జున్ తోపాటు నాని, వెంకటేశ్ తో సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. వీరు కాకపోయినా మరో స్టార్ హీరోతో మూవీ తెరకెక్కిస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే తన కొత్త సినిమాలో ఈ సిగ్నేచర్- ఇల్లుకు వెళ్లే అంశాన్ని త్రివిక్రమ్ వదిలేయాలని నెటిజన్లు చెబుతున్నారు. మరి త్రివిక్రమ్ ఏం చేస్తాడో చూడాలి.