Begin typing your search above and press return to search.

పుష్ప తర్వాత త్రివిక్రమ్ డెసిషన్ మార్చుకుంటాడా..?

గుంటూరు కారం సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ అందించాడు. మ్యూజిక్ పరంగా సినిమా అలరించింది

By:  Tupaki Desk   |   12 April 2024 6:14 AM GMT
పుష్ప తర్వాత త్రివిక్రమ్ డెసిషన్ మార్చుకుంటాడా..?
X

తెలుగు స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన త్రివిక్రం శ్రీనివాస్ తను చేసే సినిమాలన్నీ ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉన్నా కూడా వాటిని అభిమానులు యాక్సెప్ట్ చేసేలా కమర్షియల్ హిట్లు కొడుతుంటాడు. అల వైకుంఠపురములో తర్వాత గుంటూరు కారం సినిమా చేసిన త్రివిక్రం మహేష్ వన్ మ్యాన్ షోతో ఆ సినిమా సక్సెస్ అందుకునేలా చేశాడు. అఫ్కోర్స్ ఆ సినిమాలో త్రివిక్రం మార్క్ కనిపించలేదు అన్న టాక్ గట్టిగానే వచ్చినా వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు గురూజీ. గుంటూరు కారం సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ అందించాడు. మ్యూజిక్ పరంగా సినిమా అలరించింది.

అయితే ఒకప్పుడు త్రివిక్రం సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ ఫిక్స్ అనేలా ఉండేది. త్రివిక్రం మొదటి డైరెక్టోరియల్ మూవీ నువ్వే నువ్వేకి కోటి సంగీతం అందించగా ఆ తర్వాత తీసిన అతడుకి మణిశర్మ మ్యూజిక్ అందించారు. ఆ తర్వాత జల్సాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అదరగొట్టాడు. అయితే తర్వాత మహేష్ తో చేసిన ఖలేజాకి కూడా దేవిని తీసుకోవాలని అనుకున్నా కుదరలేదు. మహేష్ ప్రిఫరెన్స్ ప్రకారం మణి శర్మతో కానిచ్చారు.

ఆ తర్వాత జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి ఇలా వరుసగా త్రివిక్రం దేవి శ్రీ ప్రసాద్ మ్యూజికల్ హిట్స్ కొట్టారు. నితిన్ తో చేసిన అఆ సినిమా టైం లో దేవి శ్రీ ప్రసాద్ ను కాదని మిక్కీ జే మేయర్ తో పనిచేశారు త్రివిక్రం. ఆ తర్వాత అజ్ఞాతవాసి కి అనిరుద్ ని తీసుకొచ్చారు. ఎన్.టి.ఆర్ తో చేసిన అరవింద సమేతకు థమన్ ని పిక్ చేసుకున్నారు. దేవిని కాదని తనను తీసుకున్న త్రివిక్రం పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు థమన్ కష్టపడ్డాడు.

అల్లు అర్జున్ తో చేసిన అల వైకుంఠపురములో సినిమాకు థమన్ ఇచ్చిన మ్యూజిక్ ఆల్ టైం ఫేవరెట్ గా మారింది. ఆ సినిమాతో ఈ ఇద్దరిది కూడా బ్లాక్ బస్టర్ కాంబోగా నిలిచింది. మహేష్ గుంటూరు కారం కి కూడా థమన్ ని తీసుకున్నాడు త్రివిక్రం. మరి మళ్లీ త్రివిక్రం దేవి శ్రీ ప్రసాద్ కలిసి పనిచేసే రోజు కోసం ఆడియన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. పుష్పతో తన మ్యూజిక్ స్టామినా చూపించిన దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు పుష్ప 2 తో రాబోతున్నాడు.

పుష్ప చూసిన తర్వాత అయినా కూడా త్రివిక్రం దేవితో కలిసి మరోసారి పనిచేయాలని అనుకోవట్లేదా అని ఆడియన్స్ డౌట్ పడుతున్నారు. త్రివిక్రం నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తో ఉంటుందని తెలిసిందే. మరి దానికి త్రివిక్రం దేవిని తీసుకుంటాడా థమన్ ను కొనసాగిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.