Begin typing your search above and press return to search.

నేటి స్టార్ డైరెక్ట‌ర్ అప్పుడా డైరెక్ట‌ర్ గేట్ ముందు!

తాజాగా గురూజీ క‌ష్టాల్లో నుంచి మరో క‌ష్టం వెలుగులోకి వ‌చ్చింది. అవ‌కాశాల కోసం సినిమా ఆఫీస్ లు చుట్టూ తిర‌గ‌ని రోజు అంటూ ఉండేది కాదు.

By:  Tupaki Desk   |   14 April 2024 10:30 AM GMT
నేటి స్టార్ డైరెక్ట‌ర్ అప్పుడా డైరెక్ట‌ర్ గేట్ ముందు!
X

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకొచ్చిన వారి క‌ష్టాలు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సినిమా అనే వ‌ర‌ల్డ్ లోకి అడుగు పెట్టిన నాటి నుంచి స‌క్సెస్ అయ్యేవ‌ర‌కూ ఆ క‌ష్టాలు త‌ప్ప‌వు. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా స‌క్సెస్ అవుతామ‌న్నా? గ్యారెంటీ కూడా ఉండ‌దిక్క‌డ‌. ట్యాలెంట్ తో పాటు ల‌క్ కూడా క‌లిసొస్తేనే ప‌న‌వుతుంది. ఎదిగిన వారంతా అలా పైకొచ్చిన వారే. ఇక గురూజీగా ఫేమ‌స్ అయిన త్రివిక్ర‌మ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

నేడు స్టార్ డైరెక్ట‌ర్ ఆయ‌న‌. ఇక ఎదిగే ద‌శ‌లో ఆయ‌న క‌ష్ట‌న‌ష్టాలు ఎలా సాగాయి అన్న‌ది చాలాసార్లు చెప్పారు. విశాఖ టూ అన‌కాప‌ల్లి వాకింగ్ ద‌గ్గ‌ర నంచి సునీల్ తో రూమ్ ని పంచుకోవ‌డం...అక్క‌డ సినిమా ప్ర‌య‌త్నాలు..వైఫ‌ల్యాలు చాలానే ఉన్నాయి. త్రివిక్ర‌మ్ దాచేసిన కొన్నింటిని స్నేహితుడు సునీల్ సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు వ‌దులు తుంటాడు. తాజాగా గురూజీ క‌ష్టాల్లో నుంచి మరో క‌ష్టం వెలుగులోకి వ‌చ్చింది. అవ‌కాశాల కోసం సినిమా ఆఫీస్ లు చుట్టూ తిర‌గ‌ని రోజు అంటూ ఉండేది కాదు.

అందులోనూ రైట‌ర్లు అంటే ఈవీవీ ఆఫీస్ చుట్టూ చ‌క్క‌ర్లు కొట్టాల్సిందే. రైట‌ర్లు ఆయ‌న ఆఫీస్ గేట్ ఓ అడ్డా లాంటింది. అలా త్రివిక్ర‌మ్ కూడా ఈవీవీ ఆఫీస్ మందు ప‌డిగాపులు ప‌డిన సంద‌ర్భాలెన్నో. రోజు ఫిల్మ్ న‌గ‌ర్ లోని ఈవీవీ ఆఫీస్ కి వెళ్ల‌డం...ఆయ‌న పిలుపు కోసం ఎదురు చూడ‌టం కొన్నాళ్ల పాటు త్రివిక్ర‌మ్ ఇదే ప‌నిలో ఉన్నారుట‌. ఓ రోజు ఇది గ‌మ‌నించిన ఈవీవీ ద‌గ్గ‌ర‌కు పిలిచి ఏ ఊరు? ఇక్క‌డికి ఎందుకొచ్చావ్‌? అని అడిగారుట‌. ఆ త‌ర్వాత అత‌డి చ‌దువు గురించి తెలుసుకుని ఇలా వెయిట్ చేయ‌డం న‌చ్చ‌లేదు.

మంచి ఉద్యోగం చూసుకో అని సెల‌విచ్చారుట‌. ఆయ‌న మాట‌కి త్రివిక్ర‌మ్ చెవికెక్కించుకుని అప్ప‌టి నుంచి సినిమా ఆఫీస్ గేట్ వ‌ద్ద నిల‌బ‌డ‌టం మానేసి కొత్త‌గా ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారుట‌. అ టుపై కొంత కాలానికి రైట‌ర్ గా అవ‌కాశం రావ‌డంతో స‌త్తా చాటాటం...ఆ సినిమాలు హిట్ అవ్వ‌డంతో గురూజీ త్రివిక్ర‌మ్ మారిపోయింది. ఇప్పుడు ఆయ‌న గేట్ ముందు ఎంతో మంది అవ‌కాశాల కోసం నిల‌బ‌డుతున్నారు. మ‌రి ఇది ఆయ‌న గుర్తిస్తున్నాడా? లేదా! అన్న‌ట్లు పోసాని కృష్ణ ముర‌ళీ వ‌ద్ద కూడా త్రివిక్ర‌మ్ శిష్య‌రికం చేసారు.