Begin typing your search above and press return to search.

త్రివిక్ర‌మ్ వార‌సుడు హీరోలా ఉన్నాడే!

ఇద్ద‌రు వైజాగ్ నుంచి హైద‌రాబాద్ కి తిరుగు ప్ర‌యాణంలో తిసిన సెల్పీ ఇది. రిషీ చూడ‌టానికి హీరో క‌టౌట్. మంచి హైట్ ఉన్నాడు.

By:  Tupaki Desk   |   21 Oct 2023 8:48 AM GMT
త్రివిక్ర‌మ్ వార‌సుడు హీరోలా ఉన్నాడే!
X

స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ఫ్యామిలీ గురించి చాలా త‌క్కువ‌. ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఎవ‌రూ సినిమాల్లో పెద్ద‌గా క‌నిపించ‌రు. త్రివిక్ర‌మ్ స‌తీమ‌ణి సౌజ‌న్య ఇప్పుడిప్పుడు మీడియాలో క‌నిపిస్తున్నారు. ఆమె మంచి క్లాసిక‌ల్ డాన్స‌ర్. అప్పుడ‌ప్పుడు డాన్సు షోల్లో చేస్తుంటారు. ఆ వీడియోలు రేర్ గా నెట్టింట వైర‌ల్ అవుతుంటాయి. అయితే ఈ మ‌ద్య కాలంలో ఆమె సౌజ‌న్య నిర్మాణంలో భాగ‌మ‌వుతున్నారు.

సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ తో క‌లిసి జ‌ర్నీ చేస్తున్నారు. అలా సౌజ‌న్య పేరు ఈ మ‌ధ్య ఎక్కువ‌గా వినిపిస్తుంది. అయితే త్రివిక్ర‌మ్ పిల్ల‌ల గురించి పెద్ద‌గా తెలియ‌దు. ఆయ‌న‌కు ఎంత మంది కుమారులు...కుమార్తెలు అన్న‌ది తెలియ‌దు. ఇంత‌వ‌ర‌కూ వాళ్ల గురించి ఏ వివ‌రాలు కూడా బ‌య‌ట రాలేదు. గురూజీ ఏ సంద‌ర్భంలోనూ చెప్పింది. తాజాగా త్రివిక్ర‌మ్ కుమారుడి ఫోటో ఒక‌టి ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది.

దివంగ‌త గీత ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి -సౌజన్య బంధువు అయిన రాజా చెంబోలు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక చిత్రాన్ని పంచుకున్నారు. ఫోటోలో సౌజ‌న్య వెనుక రిషీ క‌నిపిస్తున్నాడు. ఇద్ద‌రు వైజాగ్ నుంచి హైద‌రాబాద్ కి తిరుగు ప్ర‌యాణంలో తిసిన సెల్పీ ఇది. రిషీ చూడ‌టానికి హీరో క‌టౌట్. మంచి హైట్ ఉన్నాడు. త్రివిక్ర‌మ్ కి అచ్చు గుద్దిన‌ట్లే ఉన్నాడు. క‌ళ్ల‌ద్దాలు మాత్రం భారీగానే ఉన్నాయి.

త్రివిక్ర‌మ్ లానే జీనియ‌స్ లా క‌నిపిస్తున్నాడు. రిషీ ద‌ర్శ‌కుడిగా లాంచ్ అయ్యే అవ‌కాశాలున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. అత‌ని తెలివి తేట‌ల‌కు మంచి ద‌ర్శ‌కుడు కాగ‌ల‌డ‌ని కుటుంబం భావిస్తున్న‌ట్లు వినిపిస్తుంది.

అదే జ‌రిగితే టాలీవుడ్ కి మ‌రో జూనియ‌ర్ త్రివిక్ర‌మ్ దొరికిన‌ట్లే. ప్ర‌స్తుతం రిషీ త‌ల్లితో క‌లిసి చిత్ర నిర్మాణ రంగంపై నైపుణ్యం సంపాదించే ప‌నిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. రిషీని ఇంత‌వ‌ర‌కూ త్రివిక్ర‌మ్ ఎక్క‌డా ప‌రిచ‌యం చేయ‌లేదు. ఏ వేడుక‌కు త‌న వెంట తీసుకొచ్చింది లేదు. మ‌రి ప్ర‌చారం జ‌రుగుతు న్న‌ట్లు రిషీ ద‌ర్శ‌కుడు అవుతాడా? హీరో అవుతాడా? అన్న‌ది ధృవీక‌రించాల్సింది గురూజీనే.