Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్.. ఆ మల్టీస్టారర్ దారిలోకొచ్చేలా..

అయితే టాలీవుడ్ వర్గాల్లో మాత్రం వెంకటేష్- నాని మల్టీస్టారర్ పై ఎప్పటి నుంచో రూమర్లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   24 Jan 2024 6:45 AM GMT
త్రివిక్రమ్.. ఆ మల్టీస్టారర్ దారిలోకొచ్చేలా..
X

సంక్రాంతికి సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు విక్టరీ వెంకటేష్. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ.. మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా.. త్రివిక్రమ్ డైరెక్షన్ లో నానితో మల్టీస్టారర్ మూవీ నిజమేనా అని ప్రశ్నించగా.. వెంకీ మామ ఫన్నీగా స్పందించిన విషయం తెలిసిందే. 'బాబూ ఇప్పుడు ఎవరో ఒకరు త్రివిక్రమ్ కు కాల్ చేసి అడగండి' అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు

అయితే టాలీవుడ్ వర్గాల్లో మాత్రం వెంకటేష్- నాని మల్టీస్టారర్ పై ఎప్పటి నుంచో రూమర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ రూమర్ ను ఓ ప్రముఖ నిర్మాత సీరియస్ గా తీసుకున్నారట. వెంకీ- నాని కాంబినేషన్ ను సెట్ చేసే పనిలో ఇప్పుడు ఉన్నారట. త్రివిక్రమ్ ఈ సినిమా డైరెక్ట్ చేసేలా ఆ నిర్మాత స్కెచ్ గీస్తున్నారట.

హాయ్ నాన్న తర్వాత నాని ప్రస్తుతం సరిపోదా శనివారం మూవీ పూర్తి చేస్తున్నారు. తన నెక్స్ట్ సినిమా శ్రీకాంత్ ఓదెలతో ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఆ సినిమాకు 6 నెలలు టైం ఉన్న కారణంగా మరో మూవీ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక వెంకటేష్ సైంధవ్ సినిమా నిరాశపరచగా తన నెక్స్ట్ మూవీ కోసం ఎలాంటి ప్లాన్ చేయలేదు. దీంతో త్రివిక్రమ్ డైరెక్షన్ లో నాని- వెంకీ మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నారట ఆ నిర్మాత.

ఈ సినిమాను త్రివిక్రమ్.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై కాకుండా బయట ప్రొడక్షన్ లో చేస్తారని తెలుస్తోంది. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ కాస్త గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నారట. కానీ తన కొత్త ప్రాజెక్ట్ లను పక్కనపెట్టి వెంకీ- నాని మూవీని తెరకెక్కించాలని ఆ నిర్మాత త్రివిక్రమ్ ను పట్టుబడుతున్నారట.

త్రివిక్రమ్ గతంలో చేసుకున్న కమిట్మెంట్ల ప్రకారం.. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు చేయాల్సి ఉంది. కానీ ఈ మల్డీస్టారర్ వైపు త్రివిక్రమ్ మొగ్గు చూపించి స్టోరీ రెడీ చేస్తే.. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుంది. త్రివిక్రమ్ కు కథ రాయడం పెద్ద కష్టమేమి కాదు. ఆయన ఎక్కువగా ఒకప్పటి నవలల ఆధారంగా సినిమాలు చేస్తుంటారు. గుంటూరు కారం మూవీని కూడా యద్ధనపూడి సులోచనా రాణి రాసిన కీర్తి కెరటాలు నవల రిఫరెన్స్ తో తీసినట్టు తెలుస్తోంది. అయితే వెంకటేష్- నాని కోసం త్రివిక్రమ్ ఎలాంటి కథలో వస్తారన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.