Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ పాన్ ఇండియా పవర్.. డౌట్స్ వద్దమ్మా!

మరి త్రివిక్రమ్ అల్లు అర్జున్ ను ఫ్యాన్ ఇండియా ప్రపంచం లో ఏవిధంగా ప్రజెంట్ చేస్తాడో చూడాలి.

By:  Tupaki Desk   |   26 July 2023 7:38 PM GMT
త్రివిక్రమ్ పాన్ ఇండియా పవర్.. డౌట్స్ వద్దమ్మా!
X

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మినిమం బాక్స్ ఆఫీస్ సక్సెస్ అందుకున్న దర్శకులు కూడా ఇప్పుడు పాన్ ఇండియా బాట లో కొనసాగుతున్నారు. ఇక 50 కోట్లు 100 కోట్ల మార్కెట్ ను టచ్ చేసిన దర్శకులు సైతం అగ్ర హీరోలతో అవకాశాలు అందుకుంటూ పాన్ ఇండియా ప్రపంచం లో అడుగులు వేస్తున్నారు. అయితే అందరూ ప్రముఖ దర్శకులు ఆ రూట్లో వెళుతూ ఉండగా వారికంటే బెస్ట్ సక్సెస్ చూసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ఇంకా లోకల్ కంటెంట్స్ అంటూ రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తూ ఉండడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

నిజానికి త్రివిక్రమ్ కు టాలెంట్ లేక కాదు కానీ అందుకు తగ్గ సరైన టైం మాత్రం అతనికి రాలేదు అని చెప్పాలి. ఇక మొత్తానికి అల్లు అర్జున్ తనకు ఎంతో ఇష్టమైన త్రివిక్రమ్ ను పాన్ ఇండియా ప్రపంచం లోకి తీసుకురాబోతున్నాడు. అయితే త్రివిక్రమ్ ఇప్పటివరకు ఎప్పుడూ కూడా తన కథల ను నేషనల్ ఆడియన్స్ కు మ్యాచ్ అయ్యే విధంగా అయితే చెప్పలేదు.

అలాంటిది బన్నీతో చేసే సినిమా కు ఏ విధంగా న్యాయం చేస్తాడు అని అందరూ సందేహిస్తుండగా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల వలన ఇప్పుడు త్రివిక్రమ్ పై నమ్మకం అయితే పెరిగింది అని చెప్పవచ్చు. బ్రో ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ స్నేహం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ అతని టాలెంట్ గురించి కూడా చెప్పాడు. స్పష్టంగా, త్రివిక్రమ్ హిందీ లో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నారని, ఉత్తర భారతదేశం లోని హిందీ భాష, సాహిత్యం మరియు పురాతన కథల పై కూడా భారీ పట్టు ఉందని పవర్‌స్టార్ పేర్కొన్నాడు.

రానా కూడా హిరణ్యకశిప లాంటి ప్రాజెక్టు కు త్రివిక్రమ్ ను సెలెక్ట్ చేసుకోవడం వెనుక సలు కారణం కూడా త్రివిక్రమ్ టాలెంట్ ను చూసే. త్రివిక్రమ్ బాహ్య ప్రపంచంలో ఎక్కువ స్థాయి లో ఇంటర్వ్యూలు ఇవ్వరు కానీ ఆయన ఎవరి తో మాట్లాడినా కూడా చరిత్రల గురించి అలాగే సాహిత్యాల గురించి కూడా ఎంతో తెలివిగా మాట్లాడుతుంటారు.

ఆయనకు దగ్గరగా ఉండేవారికి ఆయన టాలెంట్ గురించి బాగా తెలుసు అని పవర్ స్టార్ చేసిన కామెంట్స్ తో అర్థమవుతుంది. ఇక అల్లు అర్జున్ ఎలాగైతే సుకుమార్ ను ఫ్యాన్ ఇండియా ప్రపంచం లోకి తీసుకువచ్చాడో ఇప్పుడు త్రివిక్రమ్ ను కూడా అదే తరహాలో తీసుకువస్తాడు అని చెప్పవచ్చు. మరి త్రివిక్రమ్ అల్లు అర్జున్ ను ఫ్యాన్ ఇండియా ప్రపంచం లో ఏవిధంగా ప్రజెంట్ చేస్తాడో చూడాలి.