Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్.. ఆశలు వదులికోవాల్సిందే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ పై ఉన్నారు. తాజాగా ఈ మూవీ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్క్రీనింగ్ కి వెళ్ళింది.

By:  Tupaki Desk   |   19 Feb 2024 4:02 AM GMT
త్రివిక్రమ్.. ఆశలు వదులికోవాల్సిందే?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ పై ఉన్నారు. తాజాగా ఈ మూవీ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్క్రీనింగ్ కి వెళ్ళింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్లారు. పుష్ప సినిమాకి ఎంత అద్భుతమైన ఆదరణ లభించింది అనేది దీనిని బట్టి స్పష్టం అవుతోంది. ఇక బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన నెక్స్ట్ సినిమా ఇంకా ఏదీ కన్ఫర్మ్ కాలేదని ప్రకటించారు.

పుష్ప 2 రిలీజ్ తర్వాత పాన్ ఇండియా ఇమేజ్ ని రీచ్ అయ్యే కాన్సెప్ట్స్ చేస్తానని స్పష్టం చేశారు. పుష్ప సిరీస్ కంటే బెస్ట్ కథతో నెక్స్ట్ ప్రాజెక్ట్ తో వచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు. అల్లు అర్జున్ ప్రకటనతో పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎనౌన్స్ అయిన ప్రాజెక్ట్ ఆగిపోయినట్లే అని తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో నాలుగో మూవీగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ ఉంటుందని ఒక వీడియోతో అల్లు అర్జున్ గత ఏడాది ఎనౌన్స్ చేశారు.

త్రివిక్రమ్, బన్నీ కాంబోలో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో నాలుగో మూవీ పాన్ ఇండియా రేంజ్ లో అంటే కచ్చితంగా కథ కూడా యూనివర్సల్ లెవల్ లో ఉండొచ్చని అందరూ ఊహించుకున్నారు. పుష్ప 2 మూవీ ఆగష్టు 15న రిలీజ్ అవుతుందని ఎనౌన్స్ చేశారు. కానీ షూటింగ్ మాత్రం చాలా నెమ్మదిగా సాగుతోంది. అప్పటికి కంప్లీట్ కాకపోవచ్చు అనే మాట వినిపిస్తోంది.

అదే జరిగితే రిలీజ్ డేట్ మళ్ళీ వాయిదా పడే ఛాన్స్ ఉంది. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ ఈ ఏడాది ఆరంభంలో ఉంటుందని ఎనౌన్స్ చేశారు. పుష్ప 2 మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. షూటింగ్ అయ్యాక ప్రమోషన్స్ పైన రెండు నెలలు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా చూసుకున్న ఈ ఏడాది ఆఖరు వరకు అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఉండే ఛాన్స్ అయితే లేదు.

ఇప్పుడు బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బన్నీ మాటల బట్టి త్రివిక్రమ్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో లేనట్లు కనిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అయితే బన్నీ ఒక మూవీ ఎనౌన్స్ చేశారు. అదైనా ఉంటుందా అనేది కూడా క్లారిటీ లేదు. పుష్ప 2 తర్వాత మాత్రం అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి ముందుకి వెళ్లే అవకాశం ఉందని స్పష్టం అవుతోంది. ఇక లిస్టులో బోయపాటి కూడా ఉన్నాడు. కానీ ఆయనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఏది ఏమైనా పర్ఫెక్ట్ స్క్రిప్ట్ సెట్టయితే కానీ బన్నీ ఓకే చెప్పేలా లేడని తెలుస్తోంది.