Begin typing your search above and press return to search.

గురూజీ డబుల్ ధమాకా..?

గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ చేయబోయే సినిమాల మీద మీడియాలో రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   8 Feb 2024 10:30 AM GMT
గురూజీ డబుల్ ధమాకా..?
X

గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ చేయబోయే సినిమాల మీద మీడియాలో రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. అసలైతే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ చేశారు. కానీ బన్నీ పుష్ప 2 తర్వాత అట్లీ డైరెక్షన్ లో సినిమాకు ఆసక్తి చూపిస్తున్నారట. ఆలోగా సందీప్ వంగ సినిమా కూడా లైన్ లో ఉంది. అయితే అల్లు అర్జున్ బిజీ కాబట్టి మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో గురూజీ సినిమా లైన్ చేస్తున్నట్టు టాక్. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఇప్పటివరకు చరణ్ సినిమా చేయలేదు.

ఈ కాంబినేషన్ మెగా ఫ్యాన్స్ కే కాదు ఆడియన్స్ కి కూడా మంచి ట్రీట్ అందిస్తుంది. చరణ్ ప్రస్తుతం కమిటైన సినిమాలు పూర్తి కాగానే ఈ సినిమా ఉంటుందని టాక్. చరణ్ తో సినిమా ఓకే చేసుకుని మరోపక్క యువ హీరోతో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. ముందు యంగ్ హీరో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి అది కొంత పూర్తి చేసి మళ్లీ చరణ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ చూస్తారని తెలుస్తుంది.

సో త్రివిక్రం ఒకేసారి రెండు సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఒకటి చరణ్ తో ఉంటుందని తెలుస్తుండగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో చాన్స్ అందుకున్న ఆ యువ హీరో ఎవరన్నది మాత్రం తెలియట్లేదు. నాని, రామ్ ఇద్దరి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వాళ్లిద్దరిలో ఎవరు డేట్స్ ముందు ఇస్తే వారితో సినిమా చేయడానికి త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు.

గుంటూరు కారం సినిమా విషయంలో త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదని టాక్ బాగా వచ్చింది. అయితే మహేష్ చరిష్మాతో సినిమా వసూళ్లు గట్టిగా రాబట్టింది కానీ త్రివిక్రమ్ స్టైల్ లో సినిమా లేదన్న మాట వాస్తవమే. మరి నెక్స్ట్ రాబోయే సినిమాల్లో అయినా ఈ మాట రాకుండా చేసుకుంటే బెటర్ అని చెప్పొచ్చు. త్రివిక్రమ్ రెండు సినిమాల ప్లానింగ్ బాగానే ఉన్నా ముందు ఏ సినిమా అనౌన్స్ చేస్తారు.. ఎప్పుడు మొదలు పెడతారు లాంటి విషయాలు ఆడియన్స్ ని ఎగ్జైట్ అయ్యేలా చేస్తున్నాయి. తెలుగు స్టార్ హీరోలంతా కూడా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. త్రివిక్రమ్ చరణ్ సినిమా కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. చరణ్ తర్వాత ఎన్.టి.ఆర్ సినిమా ఆ తర్వాత మళ్లీ పవన్ తో త్రివిక్రం సినిమా చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్.