Begin typing your search above and press return to search.

అన్‌స్టాపబుల్‌ : త్రివిక్రమ్‌ అప్పుడు మిస్‌, ఇప్పుడు మహేష్ తో..

అన్‌ స్టాపబుల్‌ షో లో పవన్‌ కళ్యాణ్‌ హాజరు అయిన సమయంలో కచ్చితంగా త్రివిక్రమ్‌ హాజరు అవ్వబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి

By:  Tupaki Desk   |   14 Dec 2023 8:14 AM GMT
అన్‌స్టాపబుల్‌ : త్రివిక్రమ్‌ అప్పుడు మిస్‌, ఇప్పుడు మహేష్ తో..
X

నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ షో లో ఇప్పటికే మహేష్ బాబు పాల్గొన్న విషయం తెల్సిందే. అయితే సంక్రాంతికి రాబోతున్న గుంటూరు కారం సినిమా కోసం మరోసారి బాలయ్య తో చిట్‌ చాట్‌ కి అన్‌ స్టాపబుల్‌ వేదికగా మహేష్ బాబు తన దర్శకుడు త్రివిక్రమ్‌ తో రెడీ అవుతున్నాడు అంటూ సమాచారం అందుతోంది.

అన్‌ స్టాపబుల్‌ షో లో పవన్‌ కళ్యాణ్‌ హాజరు అయిన సమయంలో కచ్చితంగా త్రివిక్రమ్‌ హాజరు అవ్వబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ సమయంలో త్రివిక్రమ్ కనిపించలేదు. ఆ సమయంలో మిస్ అయిన త్రివిక్రమ్‌ ఈసారి మహేష్ బాబుతో కలిసి బాలయ్య షో లో సందడి చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

బాలయ్య తో అన్‌ స్టాపబుల్‌ షో లో మహేష్ బాబు, త్రివిక్రమ్‌ తో పాటు హీరోయిన్‌ శ్రీ లీల కూడా సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. యానిమల్‌ సినిమా ని అన్‌ స్టాపబుల్‌ షో ద్వారా ప్రమోషన్‌ చేయడం జరిగింది. ఆ సినిమా ఫలితం ఏంటో మన అందరికి తెల్సిందే. అంతకు ముందు భగవంత్‌ కేసరి టీమ్‌ కూడా అన్‌ స్టాపబుల్‌ లో సందడి చేసింది.

సెంటిమెంట్‌ ప్రకారం చూస్తే ఈ సీజన్ లో బాలయ్య షో లో ప్రమోషన్‌ చేసిన సినిమాలకు మంచి ఫలితాలు వస్తున్నాయి. అందుకే మహేష్ బాబు గుంటూరు కారం టీమ్‌ కూడా బాలయ్య షో కి హాజరు అవ్వాలని భావిస్తున్నారు. టాక్‌ షో లో ఒకసారి పాల్గొన్న వారు మళ్లీ మళ్లీ పాల్గొనడం కొత్త ఏం కాదు. కనుక మహేష్ బాబు ను అన్‌ స్టాపబుల్‌ కి తీసుకు రావాలని బాలయ్య టీం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆహా ప్రేక్షకులకు సంక్రాంతికి ముందు కచ్చితంగా ఓ మంచి అన్‌ స్టాపబుల్‌ వినోదం ఖాయం.