Begin typing your search above and press return to search.

త్రివిక్రం తక్షణ కర్తవ్యం ఏంటి..?

గురూజీ తో అల్లు అర్జున్ సినిమా ఉంటుంది. కానీ ముందు అట్లీ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లి ఆ తర్వాత చిన్నగా త్రివిక్రం సినిమాను మొదలు పెడతారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   15 March 2024 6:33 AM GMT
త్రివిక్రం తక్షణ కర్తవ్యం ఏంటి..?
X

గుంటూరు కారం తర్వాత త్రివిక్రం శ్రీనివాస్ అల్లు అర్జున్ తోనే సినిమా ఫిక్స్ చేసుకున్నాడని తెలిసిందే. పుష్ప 2 తర్వాత బన్నీ చేసే సినిమా త్రివిక్రం దర్శకత్వంలోనే వస్తుందని ఫిక్స్ చేశారు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా చేశారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ప్లాన్ మారినట్టుగా తెలుస్తుంది. త్రివిక్రం ను వెనక్కి నెట్టి జవాన్ డైరెక్టర్ అట్లీతో సినిమా ముందుకు తీసుకెళ్లాని చూస్తున్నాడట. సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ రెండు కలిసి భారీ బడ్జెట్ తో అట్లీ, అల్లు అర్జున్ కాంబో సినిమా ప్లాన్ చేస్తున్నారని టాక్.

ఇప్పటికే అల్లు అర్జున్ కి అట్లీ కథ వినిపించడం బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. అయితే త్రివిక్రం తో చేయాల్సిన సినిమా పరిస్థితి ఏంటని కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది. తనకు హ్యాట్రిక్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ త్రివిక్రం ను లైట్ తీసుకుని బన్నీ తమిళ దర్శకుడితో సినిమా చేసే పరిస్థితి ఉండదు. గురూజీ తో అల్లు అర్జున్ సినిమా ఉంటుంది. కానీ ముందు అట్లీ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లి ఆ తర్వాత చిన్నగా త్రివిక్రం సినిమాను మొదలు పెడతారని అంటున్నారు.

పుష్ప 2 రిలీజ్ వరకు అల్లు అర్జున్ ఏ సినిమా మొదలు పెట్టే ఛాన్స్ లేదు. ఆ తర్వాత అట్లీ సినిమా సెట్స్ మీదకు వెళ్తే మరో ఆరు నెలలు అంటే ఎలా లేదన్నా త్రివిక్రం ఒక ఏడాది పాటు అల్లు అర్జున్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఈలోగా మరో ప్రాజెక్ట్ చేసినా చేయొచ్చు. త్రివిక్రం ప్లాన్స్ ఎలా ఉన్నాయన్నది తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్ కోసం అప్పటిదాకా వెయిట్ చేస్తాడా లేదా మరో హీరోతో ఒక సినిమా చకచకా కానిచ్చేస్తాడా అన్నది చూడాలి.

త్రివిక్రం సినిమా చేస్తానంటే మేం రెడీ అనే టైర్ 2 హీరోలు చాలా మంది ఉన్నారు. రాం, రవితేజ, నాని ఇలా మీడియం రేంజ్ హీరోలంతా కూడా గురూజీ ఓకే అనాలే కానీ సినిమా చేసేందుకు ఓకే అనేస్తారు. అల్లు అర్జున్ సినిమాకు ముందు త్రివిక్రం మరో సినిమా చేస్తాడా లేదా బన్నీ కోసం వెయిట్ చేస్తాడా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఇదంతా కాకుండా త్రివిక్రం సినిమానే ముందు కానిచ్చేసి ఆ తర్వాతే అట్లీకి బన్నీ ఛాన్స్ ఇచ్చినా ఇవ్వొచ్చనే టాక్ కూడా ఉంది. అలా అయితే త్రివిక్రం అల్లు అర్జున్ సినిమా కోసమే పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్లారిటీ రావాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదు.