చరణ్ తో మల్టీ స్టారర్.. ఛాన్స్ లేదంతే..!
సంక్రాంతికి వస్తున్నాం లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత విక్టరీ వెంకటేష్ మరో బ్లాక్ బస్టర్ కోసమే రంగం సిద్ధం చేస్తున్నాడు.
By: Tupaki Desk | 19 May 2025 2:38 PMసంక్రాంతికి వస్తున్నాం లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత విక్టరీ వెంకటేష్ మరో బ్లాక్ బస్టర్ కోసమే రంగం సిద్ధం చేస్తున్నాడు. అందుకే ఆ సినిమాకు డైరెక్టర్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రం ని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. వెంకటేష్ త్రివిక్రం ఈ కాంబినేషన్ సినిమా కోసం కొన్నేళ్లుగా తెలుగు ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఐతే త్వరలో ఈ కాంబో సినిమా రాబోతుందని టాక్. రైటర్ గా వెంకటేష్ సినిమాలకు పనిచేసిన త్రివిక్రం డైరెక్టర్ గా మారాక ఎందుకో కలిసి పనిచేయడం కుదరలేదు.
ఫైనల్ గా ఇన్నాళ్లకు ఈ కలయికలో సినిమా వస్తున్నందుకు ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఐతే త్రివిక్రం వెంకీ చేసే సినిమాలో మరో స్టార్ కూడా ఉంటాడని గురూజీ వెంకటేష్ తో చేసే సినిమా మల్టీస్టారర్ అని హడావిడి మొదలైంది. ప్రస్తుతం స్టార్ హీరోలంతా కూడా వారి సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ టైమ్ లో మల్టీస్టారర్ కి డేట్స్ ఇచ్చే ఛాన్స్ అసలు లేదు.
త్రివిక్రం వెంకటేష్ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉంటాడన్న టాక్ వినిపిస్తుంది. చరణ్ ప్రస్తుతం బుచ్చి బాబు డైరెక్షన్ లో పెద్ది సినిమా పూర్తి చేసే పనుల్లో ఉన్నాడు. పెద్ది సినిమాను చరణ్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. ఆ సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఇలాంటి టైం లో చరణ్ వెంకటేష్ త్రివిక్రం సినిమాలో నటిస్తాడన్న వార్తలు వైరల్ అయ్యాయి.
చరణ్ పెద్ది పూర్తి చేసిన తర్వాత ఏమాత్రం గ్యాప్ లేకుండా సుకుమార్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. మరి చరణ్ వెంకీ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటాడన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పొచ్చు. ఒకవేళ ఏదైనా సరదాగా క్యామియో లాంటిది చేస్తే చేస్తాడేమో కానీ మల్టీస్టారర్ అంటే మళ్లీ ఆ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయాలి పెద్ది షెడ్యూల్ డిస్టర్బ్ చేసేలా చరణ్ అలాంటి రిస్క్ చేస్తాడని మాత్రం అనుకోలేం. ఐతే చరణ్ కాకపోతే త్రివిక్రం వెంకటేష్ మల్టీస్టారర్ లో నటించే మరో హీరో ఎవరు.. అది నిజంగా మల్టీస్టారర్ సినిమానా కాదా అన్నది త్వరలో క్లారిటీ వస్తుంది. వెంకటేష్ త్రివిక్రం కాంబో సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా స్పెషల్ ట్రీట్ అందించేలా ఉంటుందని అంటున్నారు. ఐతే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ బయటకు రావాల్సి ఉంది.