Begin typing your search above and press return to search.

గురూజీ కథ ఫైనల్ కాలేదా..?

వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు రైటర్ గా పనిచేశారు త్రివిక్రం.

By:  Tupaki Desk   |   25 Jun 2025 7:00 PM IST
గురూజీ కథ ఫైనల్ కాలేదా..?
X

మాటల మాంత్రికుడు త్రివిక్రం మహేష్ తో గుంటూరు కారం తర్వాత తన నెక్స్ట్ సినిమా అసలైతే అల్లు అర్జున్ తో చేయాల్సింది కానీ ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. అల్లు అర్జున్ తో మైథలాజికల్ సినిమా చేయాలని భావించిన త్రివిక్రం ఆ ప్రాజెక్ట్ లో హీరోని మార్చేశాడని కూడా టాక్. ఐతే ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే దాకా ఎలాంటి కన్ ఫర్మేషన్ ఇవ్వలేం. ఇదిలా ఉంటే త్రివిక్రం నెక్స్ట్ సినిమా విక్టరీ వెంకటేష్ తో చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్.

వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు రైటర్ గా పనిచేశారు త్రివిక్రం. డైరెక్టర్ గా మారిన తర్వాత వెంకటేష్ తో సినిమా చేయాలని అనుకున్నా సరైన కథ దొరక్క ఇన్నాళ్లు వెయిట్ చేశారు. ఏదో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలో వెంకీ అలా వచ్చి ఇలా వెళ్లాడు.. ఆ టైం లోనే గురూజీ డైరెక్షన్ లో వెంకటేష్ సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకున్నారు.

ఇన్నాళ్లకు ఆ రోజు వచ్చిందని తెలుస్తుంది. త్రివిక్రం నెక్స్ట్ సినిమా వెంకటేష్ తోనే అని దాదాపు కన్ఫర్మ్ అంటున్నారు. ఐతే వెంకటేష్ కూడా త్రివిక్రం అనగానే ఫుల్ స్క్రిప్ట్ పూర్తి కాకుండానే సినిమాకు ఓకే చెప్పాడట. ఐతే గురూజీ మాత్రం సినిమా కథ ఫైనల్ కాలేదని అంటున్నారు. త్రివిక్రం తో సినిమా అంటే వెంకటేష్ ఎలా ఉన్నా చేసేద్దాం అన్నట్టుగా ఉన్నాడు. ఇన్నాళ్లు స్టార్ సినిమాలు చేస్తూ వచ్చిన త్రివిక్రం స్టార్స్ అంతా బిజీగా ఉన్న ఈ టైం లో వెంకటేష్ తో సినిమాకు రెడీ అంటున్నాడు.

సినిమా కథ చూచాయగా చెప్పినా ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ మాత్రం రెడీ అవలేదట. అయినా కూడా సినిమా అనౌన్స్ చేసి ముహూర్తం పెట్టాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. త్రివిక్రం మాత్రం పూర్తి స్క్రిప్ట్ అయ్యాకే సినిమా మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. ఏది ఏమైనా ఈ కాంబో సినిమా మాత్రం ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ అందిస్తుందని మాత్రం చెప్పొచ్చు. వెంకటేష్ సినిమా పాన్ ఇండియా ఉండకపోవచ్చు కానీ గురూజీ ఎన్ టీ ఆర్ తో చేసే సినిమా మైథాలజీ సబ్జెక్ట్ తో కొత్త కాన్సెప్ట్ తో వస్తుందని తెలుస్తుంది.