వెంకటేష్ కోసం గురూజీ హోమ్ వర్క్..?
రైటర్ గా ఉన్నప్పుడు త్రివిక్రమ్ తో ఎక్కువ సినిమాలు చేసిన స్టార్ హీరో వెంకటేష్ మాత్రమే. ఆయన నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు అదిరిపోయే పంచ్ డైలాగ్స్ రాశారు త్రివిక్రమ్ శ్రీనివాస్.
By: Tupaki Desk | 2 Jun 2025 4:00 AM ISTరైటర్ గా ఉన్నప్పుడు త్రివిక్రమ్ తో ఎక్కువ సినిమాలు చేసిన స్టార్ హీరో వెంకటేష్ మాత్రమే. ఆయన నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు అదిరిపోయే పంచ్ డైలాగ్స్ రాశారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఐతే ఆ తర్వాత ఆయన డైరెక్టర్ గా మారి సినిమాలు చేస్తున్నారు. త్రివిక్రం దర్శకుడిగా మారిన తర్వాత ఆయన మొదటి ఆప్షన్ హీరోగా వెంకటేష్ అవుతాడని అనుకోగా అది కాస్త చాలా టైం పట్టింది. రైటర్ గా ఉన్నప్పుడు కలిసి పనిచేసిన వెంకటేష్, త్రివిక్రమ్ కలిసి సినిమా చేయడం కుదరలేదు.
ఫైనల్ గా ఇన్నాళ్లకు ఈ కాంబో సినిమా రాబోతుంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత విక్టరీ వెంకటేష్ చేసే సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లోనే అని తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఐతే వెంకటేష్ సినిమా కోసం త్రివిక్రమ్ తన హోమ్ వర్క్ మొదలు పెట్టాడని తెలుస్తుంది. అదేంటి గురూజీ ఇలా పెన్ను పడితే అలా కథ కథనం మాటలు వచ్చేస్తాయి కదా అనుకోవచ్చు. నిజమే కానీ వెంకటేష్ తో సినిమా అంటే కొన్ని అంచనాలు ఉంటాయి.
ఆల్రెడీ రైటర్ గా వెంకటేష్ కి అదిరిపోయే వన్ లైనర్స్ ఇచ్చిన త్రివిక్రమ్ ఈసారి దర్శకుడు ఇంకా రైటర్ గా వాటిని మించి పంచ్ డైలాగ్స్ రాయాలి. దానికోసం కొంత హోమ్ వర్క్ చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. అదీగాక గుంటూరు కారం సినిమా చూసిన తర్వాత చాలామంది త్రివిక్రమ్ రైటింగ్ మీద కామెంట్స్ చేశారు. గురూజీ పెన్నులో ఇంక్ అయిపోయింది అని కూడా విమర్శించారు. సో నెక్స్ట్ సినిమాతో వాటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
వెంకటేష్ తో తీసే సినిమాకు త్రివిక్రమ్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇప్పటికే స్టోరీ లాక్ అవ్వగా ఫైనల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో గురూజీ బిజీగా ఉన్నారట. అసలైతే త్రివిక్రం వెంకటేష్ కి బదులుగా అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సింది. కానీ అట్లీ మధ్యలో ఎంటర్ అయ్యే సరికి త్రివిక్రమ్ మరో హీరోని వెతుక్కోక తప్పలేదు. వెంకటేష్ తో త్రివిక్రం చేసే సినిమా కోసం తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ కాంబో సినిమా ఏ రేంజ్ సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
