త్రివిక్రమ్ దృష్టిలో పడిందంటే మాత్రం..!
గుంటూరు కారం సినిమా తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సి ఉండగా ఆ ప్రాజెక్ట్ ని వాయిదా వేసుకున్నారు.
By: Tupaki Desk | 26 May 2025 5:00 AM ISTగుంటూరు కారం సినిమా తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సి ఉండగా ఆ ప్రాజెక్ట్ ని వాయిదా వేసుకున్నారు. అట్లీతో సినిమా చేసే క్రమంలో త్రివిక్రమ్ మూవీ పోస్ట్ పోన్ చేసుకున్నాడు అల్లు అర్జున్. అట్లీతో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా ఎలా లేదన్నా రెండేళ్లు పడుతుంది. అప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకని త్రివిక్రమ్ కూడా నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్ ఈసారి సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది.
వెంకటేష్ తో త్రివిక్రం ఈ కాంబో కోసం ఎన్నో ఏళ్లుగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నప్పుడు వెంకటేష్ సినిమాలకు మాటలు ఇచ్చారు. ఇప్పటికీ వీరి కాంబో సినిమాలు ఎక్కడ చూసినా ఎంటర్టైన్ చేస్తాయి. ఐతే ఈసారి త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకటేష్ సినిమా అనగానే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న వెంకటేష్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తోనే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యారు.
ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఐతే ఈ మూవీలో హీరోయిన్ గా కన్నడ భామ రుక్మిణి వసంత్ నటిస్తుందని తెలుస్తుంది. కన్నడలో వరుస సినిమాలు చేస్తున్న రుక్మిణి సప్త సాగరాలు దాటితో తెలుగు ప్రేక్షకులను అలరించింది. నిఖిల్ తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చేసినా అది అంతగా ఇంపాక్ట్ చూపించలేదు. ఇప్పటికే ఎన్ టీ ఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాలో రుక్మిణి నటిస్తుందని తెలుస్తుంది.
ఐతే త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటే కచ్చితంగా సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. త్రివిక్రమ్ దృష్టిలో పడిందంటే రుక్మిణి తెలుగులో స్టార్ రేంజ్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. వెంకటేష్ తో త్రివిక్రం చేస్తున్న సినిమాతో రుక్మిణి కచ్చితంగా తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరవుతుందని చెప్పొచ్చు. ఎన్ టీ ఆర్, వెంకటేష్ ల సినిమాలు మాత్రమే కాదు మరో పాన్ ఇండియా సినిమాలో కూడా రుక్మిణి హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి తెలుగు ఎంట్రీ డిజప్పాయింట్ చేసినా రుక్మిణి నుంచి రాబోతున్న నెక్స్ట్ సినిమాలన్నీ ఒకదానికి మించి మరొకటి అనిపించేలా ఉన్నాయి. ఆ సినిమాలన్నీ వస్తే రుక్మిణి టాలీవుడ్ టాప్ ప్లేస్ లో ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పొచ్చు.
