గురూజీపై 'గుంటూరు కారం' ఎఫెక్ట్ గట్టిగానే పడిందా?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు `గుంటూరు కారం` దెబ్బ గట్టిగానే తగిలినట్టుంది. మహేష్‌తో చేసిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే
By: Tupaki Desk | 13 Jun 2025 2:30 PMమాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు `గుంటూరు కారం` దెబ్బ గట్టిగానే తగిలినట్టుంది. మహేష్‌తో చేసిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో చేసిన ఈ మూవీ అందులో సగాన్నిమాత్రమే రాబట్టి భారీ డిజాస్టర్ అనిపించుకుంది. మహేష్‌తో లెక్కలు వేసుకుని మరీ చేసిన సినిమా, స్క్రిప్ట్‌లు మార్చి మార్చి చేసిన సినిమా ఇలా డిజాస్టర్ కావడంతో గురూజీగా పేరున్న త్రివిక్రమ్‌పై భారీ ఎఫెక్ట్ పడినట్టుగా తెలుస్తోంది.
దీని కారణంగానే తదుపరి ప్రాజెక్ట్ అంతా స్పీడుగా పట్టాలెక్కలేకపోతోంది. గతంలో మహేష్‌తో చేసిన `ఖలేజా` ఫ్లాప్ తరువాత కూడా త్రివిక్రమ్ ఇదే దరహా పరిస్థితని ఎదుర్కొన్నాడు. అప్పుడు వరుసగా బన్నీ అవకాశాలు ఇవ్వడంతో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాలు చేసి హిట్ అని పించుకున్న విషయం తెలిసిందే. అరవింద సమేత తరువాత కూడా బన్నీ `అలవైకుంఠపురములో` చేయడం, అది ఇద్దరికి బ్లాక్ బస్టర్‌ని అందించడం తెలిసిందే. అయితే `గుంటూరు కారం` ఫలితం మాత్రం గురూజీని బాగానే హర్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఆ కారణంగానే తదుపరి ప్రాజెక్ట్ కోసం ఆయన తొందర పడటం లేదట. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ మరోసారి బన్నీతో కలిసి భారీ స్థాయిలో మైథలాజికల్ డ్రామాని తెరపైకి తీసుకురావాలనుకున్నారు. పురాణ ఇతిహాసాల్లోని కుమార స్వామి కథతో ఈ సినిమాని చేయాలనుకున్నారు. ప్రకటన కూడా చేశారు. అయితే దీని ప్రీ ప్రొడక్షన్‌కు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో `పుష్ప 2` వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ క్రేజ్‌ని వృధాచేయడం ఇష్టంలేని బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టి తమిళ దర్శకుడు అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే.
దీంతో చేసేది లేక త్రివిక్రమ్ ఆ కథని హీరో ఎన్టీఆర్‌తో చేయాలని ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ `డ్రాగన్` మూవీ షూటింగ్‌లో బిజీగా ఉండటం, త్రివిక్రమ్ అనుకున్న మైథలాజికల్ ప్రాజెక్ట్‌కు మరింత సమయం అవసరం కావడంతో ఈ గ్యాప్‌లో విక్టరీ వెంకటేష్‌తో సినిమాని పట్టాలెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ని ఫైనల్ చేసిన త్రివిక్రమ్ ఈ మూవీని త్వరలోనే పట్టాలెక్కించబోతున్నాడట. వెంకీతో కొంత కాలంగా సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్‌కు ఇప్పటికి కుదిరిందని, ఈ ప్రాజెక్ట్ ఇద్దరి మార్కు కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగుతుందని చెబుతున్నారు. గతంలో వెంకటేష్ నటించిన `నువ్వు నాకు నచ్చావ్`, `మళ్లీశ్వరి` సినిమాలకు త్రివిక్రమ్ స్టోరీ, డైలాగ్స్ అందించారు. తొలిసారి వెంకటేష్ మూవీకి డైరెక్షన్ చేయబోతున్నారు.