Begin typing your search above and press return to search.

త్రివిక్ర‌మ్ కు పెద్ద ప‌రీక్షే!

అల్లు అర్జున్ నుంచి ఓ చిన్న ప‌ర్మిష‌న్ వ‌స్తే వెంకీ- త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్ అఫీషియ‌ల్ గా అనౌన్స్ కానుంది. అయితే ఈ సినిమాకు పెద్ద‌గా అడ్డంకులు కూడా ఏమీ ఉండ‌క‌పోవ‌చ్చు.

By:  Tupaki Desk   |   4 May 2025 8:30 PM
త్రివిక్ర‌మ్ కు పెద్ద ప‌రీక్షే!
X

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ త్వ‌ర‌లోనే విక్ట‌రీ వెంక‌టేష్ తో క‌లిసి వ‌ర్క్ చేయ‌డానికి రెడీగా ఉండ‌గా, ఆ ప్రాజెక్టు ఇప్పుడు ఆల్మోస్ట్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ నుంచి ఓ చిన్న ప‌ర్మిష‌న్ వ‌స్తే వెంకీ- త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్ అఫీషియ‌ల్ గా అనౌన్స్ కానుంది. అయితే ఈ సినిమాకు పెద్ద‌గా అడ్డంకులు కూడా ఏమీ ఉండ‌క‌పోవ‌చ్చు.

బ‌న్నీ ఆల్రెడీ అట్లీ సినిమాతో బిజీగా ఉన్నాడు కాబ‌ట్టి అట్లీ సినిమా పూర్తి చేసుకుని బ‌న్నీ ఫ్రీ అయ్యే టైమ్ కు వెంకీతో సినిమాను ఫినిష్ చేసి త్రివిక్ర‌మ్ కూడా రెడీగా ఉంటాడు. కాబ‌ట్టి బ‌న్నీ నో చెప్ప‌డానికి కూడా పెద్ద‌గా రీజ‌న్స్ ఏమీ లేవు. అయితే వెంకీతో చేయ‌బోయే ఈ సినిమా త్రివిక్ర‌మ్ కు ఓ పెద్ద ఛాలెంజ్ కాబోతుంది.

వెంక‌టేష్- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ ఇప్ప‌టిది కాదు. వీరి కాంబినేషన్ లో ఇప్ప‌టికే నువ్వు నాకు న‌చ్చావ్, మల్లీశ్వ‌రి లాంటి క్లాసిక్ సినిమాలొచ్చాయి. అయితే త్రివిక్ర‌మ్ ఆ సినిమాల‌కు డైరెక్ట‌ర్ కాదు. ఆ రెండు సినిమాల‌కు త్రివిక్ర‌మ్ కేవ‌లం రైటర్ గా మాత్ర‌మే ప‌ని చేశాడు. ఆ సినిమాల్లో త్రివిక్ర‌మ్ రైటింగ్ గురించి ఇప్ప‌టికీ గొప్ప‌గా చెప్పుకుంటూ ఉంటారు.

త్రివిక్ర‌మ్ డైరెక్ట‌ర్ అయిన‌ప్ప‌టి నుంచి వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో సినిమా ఎప్పుడొస్తుందా అని ద‌గ్గుబాటి ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూశారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కు వీరి కాంబినేష‌న్ లో సినిమా రాలేదు. ఇప్పుడ‌ది కార్య‌రూపం దాలుస్తుంద‌ని తెలియ‌డంతో సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఆడియ‌న్స్ కొత్త క‌థ‌ను, కొత్త ఎంట‌ర్టైన్మెంట్ ను ఆశిస్తున్నారు.

అయితే త్రివిక్ర‌మ్ కు ఈ ప్రాజెక్టు వ‌ల్ల చాలా ఒత్తిడే ఉండ‌నుంది. ఆల్రెడీ మొన్న సంక్రాంతికి సంక్రాంతికి వ‌స్తున్నాంతో అనిల్ రావిపూడి వెంక‌టేష్ బెంచ్‌మార్క్ ను చాలా భారీగా పెంచేశాడు. ఇప్పుడు త్రివిక్ర‌మ్ దాన్ని మించిన సినిమా తీయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. మంచి ఫామ్ లో ఉన్న టైమ్ లో త్రివిక్ర‌మ్ వెంకీ కోసం చాలా బ‌ల‌మైన క‌థ‌ను రాయాలి. డైరెక్ట‌ర్ మీద న‌మ్మ‌కంతో గుడ్డిగా ముందుకెళ్లే ప్ర‌య‌త్నం ద‌గ్గుబాటి బ్ర‌ద‌ర్స్ తీసుకోరు. దాంతో పాటూ ఈ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అంటున్నారు కాబ‌ట్టి క‌చ్ఛితంగా త్రివిక్ర‌మ్ మూవీ సంక్రాంతికి వ‌స్తున్నాం కంటే పెద్ద స‌క్సెస్ అవాలి. అన్నింటికంటే ముఖ్యంగా త్రివిక్ర‌మ్ ఈ సినిమాతో త‌న స‌త్తాను చాట‌క‌పోతే ఆ ఎఫెక్ట్ త‌ను అల్లు అర్జున్ తో చేయ‌బోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ప‌డుతుంది. కాబ‌ట్టి ఈ ప్రాజెక్టు త్రివిక్ర‌మ్ కు చాలా పెద్ద ఛాలెంజ‌నే చెప్పాలి.