త్రివిక్రమ్ మిగిలిన వారితో పోటీ పడేదెప్పుడు?
రైటర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన త్రివిక్రమ్, ఆ తర్వాత డైరెక్టర్ గా మారి పలు హిట్ సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.
By: Tupaki Desk | 9 Jun 2025 3:57 PM ISTరైటర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన త్రివిక్రమ్, ఆ తర్వాత డైరెక్టర్ గా మారి పలు హిట్ సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి ఎన్నో మెమొరబుల్ సినిమాలు తీసిన ఆయన సిట్యుయేషన్ ప్రస్తుతం అనుకున్నంత బాలేదు. ఒకప్పుడు త్రివిక్రమ్ సినిమా అంటే ఎగబడి డేట్స్ ఇచ్చే స్టార్లు ఇప్పుడు ఆయనతో సినిమా అంటే లేట్ చేస్తున్నారు.
దానికి కారణం ఆయన ఫేమ్. అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాల్సింది. కానీ అది క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ కథను లాక్ చేసి, సినిమా చేద్దామనుకున్నారు. కానీ అది సెట్స్ పైకి వెళ్లాక పలు మార్లు కథ మారి గుంటూరు కారంగా మారింది. గుంటూరు కారం సినిమా మహేష్ ఫ్యాన్స్ కు నచ్చినప్పటికీ మిగిలిన వారిని మాత్రం మెప్పించలేకపోయింది.
ఇంకా చెప్పాలంటే అసలు గుంటూరు కారం సినిమా త్రివిక్రమ్ తీసిందేనా అని డౌట్ కూడా వస్తుంది. ఒకప్పుడు త్రివిక్రమ్ పేరు చెప్పగానే ఫ్యామిలీ సినిమాలు, ప్రాసలు గుర్తొచ్చేవి కానీ ఇప్పుడవి తగ్గాయి. అందుకే గుంటూరు కారం సినిమా తర్వాత త్రివిక్రమ్ నెక్ట్స్ ప్రాజెక్టుని సెట్ చేయడానికి ఇంత కాలం పడుతుంది. వాస్తవానికి బన్నీతో త్రివిక్రమ్ సినిమాను లాక్ చేసుకుని అనౌన్స్ కూడా చేశారు.
గుంటూరు కారం తర్వాత నుంచి మొన్నటివరకు త్రివిక్రమ్ ఆ ప్రాజెక్టుపైనే వర్క్ చేశాడు. భారీ బడ్జెట్ తో మైథలాజికల్ స్టోరీతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తీయనున్నామని నిర్మాత నాగ వంశీ కూడా చెప్పాడు. కానీ ఏమైందో ఏమో సడెన్ గా అల్లు అర్జున్ అట్లీతో ప్రాజెక్టును మొదలుపెట్టి అందరికీ షాకిచ్చాడు. దీంతో త్రివిక్రమ్ ఇప్పుడు మరోసారి ఖాళీ అయ్యాడు.
వెంకటేష్ తో ప్రాజెక్టు అంటున్నారు కానీ అది పట్టాలెక్కే వరకు నమ్మలేం. ఒక వేళ పట్టాలెక్కి సినిమా చేసినా అది టాలీవుడ్ కు మాత్రమే పరిమితమవుతుంది. నిన్న కాక మొన్న వచ్చిన డైరెక్టర్లు కూడా పాన్ ఇండియా సినిమాలు చేసి సత్తా చాటుతుంటే త్రివిక్రమ్ మాత్రం ఇంకా టాలీవుడ్‌కే పరిమితమవడం ఆయన ఫ్యాన్స్ ను కలవరపెడుతుంది. మరి వీటన్నింటినీ అధిగమించి త్రివిక్రమ్ తన నెక్ట్స్ ప్రాజెక్టును ఎవరితో చేస్తాడో చూడాలి.