త్రివిక్రమ్ సినిమాలు.. నాగవంశీ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కొత్త సినిమాల గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 12 Jun 2025 3:14 PM ISTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కొత్త సినిమాల గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటి వరకు త్రివిక్రమ్ రెస్పాండ్ అవ్వలేదు. తన వర్క్స్ తో బిజీగా ఉంటున్నారు. కానీ నెట్టింట యాక్టివ్ గా ఉండే యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
త్రివిక్రమ్ చేతిలో ఇప్పుడు రెండు ప్రాజెక్టులు ఉన్నట్లు నాగవంశీ వెల్లడించారు. అందులో ఒకటి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో చేస్తున్నారని.. మరో మూవీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తున్నారని పేర్కొన్నారు. వేరే హీరోలతో త్రివిక్రమ్ సినిమాలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలు అన్నీ కూడా కేవలం ఊహాగానాలు మాత్రమేనని తెలిపారు.
అదే సమయంలో త్రివిక్రమ్ కు సంబంధించిన ఏ ప్రాజెక్ట్.. ఫిక్స్ అయినా సరే తానా స్వయంగా ప్రకటిస్తానని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో నాగవంశీ గురువారం పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆయన స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదేమైనా మొత్తానికి త్రివిక్రమ్ కొత్త చిత్రాలపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది.
నిజానికి.. త్రివిక్రమ్ చివరి మూవీ గుంటూరు కారం వచ్చి ఏడాది దాటిపోయింది. ఆ తర్వాత తన కొత్త ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. కానీ ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. కొత్త మూవీని స్టార్ట్ చేయలేదు. అయితే త్రివిక్రమ్.. అల్లు అర్జున్ తో తన నెక్స్ట్ మూవీని చేస్తారని.. పుష్ప-2 తర్వాత స్టార్ట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది.
కానీ బన్నీ.. ఇప్పుడు అట్లీ మూవీతో బిజీ అయిపోయారు. రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నాగవంశీ రెస్పాండ్ అయ్యి వాటికి చెక్ పెట్టారు. అదే సమయంలో రీసెంట్ గా ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న సినిమాపై పోస్టులు పెట్టి ఒక్కసారిగా అంచనాలు పెంచారు.
కార్తికేయ స్వామి శ్లోకాన్ని పోస్ట్ చేశారు. అందులో స్కంద సేనాని అనే పదాన్ని హైలెట్ చేశారు. దీంతో అదే టైటిల్ తో సినిమా రాబోతుందని, తారక్ కార్తికేయుడిగా కనిపించనున్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలిసి అరవింద సమేత వీర రాఘవ మూవీకి గాను వర్క్ చేశారు. వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాకు స్టోరీని త్రివిక్రమ్ అందించారు. ఇప్పుడు ఇద్దరు హీరోలతో రెండో సారి వర్క్ చేయనున్నారు మాటల మాంత్రికుడు.
