Begin typing your search above and press return to search.

ఇద్దరు హీరోలు.. త్రివిక్రమ్ దారేది?

అయితే, ఇప్పుడు కొత్త కథలు, స్క్రిప్ట్‌లపై వర్క్ చేస్తూ రెండు ఆసక్తికరమైన ఆప్షన్స్‌ను పరిశీలిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   2 May 2025 12:30 PM
ఇద్దరు హీరోలు.. త్రివిక్రమ్ దారేది?
X

టాలీవుడ్‌ లో సుకుమార్, రాజమౌళి రేంజ్ కు తగ్గట్టుగా సినిమాలు చేయగలిగే సత్తా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఉంది. కానీ ఇంకా ఆయన పాన్ ఇండియా రేంజ్ కు తగ్గ రూట్లోకి రాలేదు. కానీ గురూజీకి ఆ శక్తి ఉందని అల్లు అర్జున్ బలంగా నమ్ముతున్నారు. సుకుమార్ ను పుష్ప 2తో పాన్ ఇండియా ట్రాక్ లోకి తీసుకు వచ్చినట్లే త్రివిక్రమ్ ను కూడా లాగాలని చాలా కాలంగా ఆలోచిస్తున్నాడు.

‘గుంటూరు కారం’ తర్వాత ఆయన తన నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, ఇప్పుడు కొత్త కథలు, స్క్రిప్ట్‌లపై వర్క్ చేస్తూ రెండు ఆసక్తికరమైన ఆప్షన్స్‌ను పరిశీలిస్తున్నాడు. ఒకవైపు విక్టరీ వెంకటేష్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, మరోవైపు తమిళ స్టార్ సివకార్తికేయన్‌తో కొత్త జోనర్ సినిమా. ఈ రెండు ఛాయిస్‌ల మధ్య త్రివిక్రమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

త్రివిక్రమ్ గతంలో అల్లు అర్జున్‌తో ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నాడు. అందుకే, అల్లు అర్జున్‌తో నాల్గో సినిమా జెట్ స్పీడ్ లో తీస్తాడని అంతా భావించారు. కానీ, అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీతో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో బిజీ అయ్యాడు. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పూర్తై, VFX స్టూడియో డీల్స్ కూడా ఫైనల్ అయ్యాయి.

అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్‌తో బిజీ కావడంతో, త్రివిక్రమ్ తన నెక్స్ట్ సినిమా కోసం వేరే హీరోల వైపు చూస్తున్నాడు. లేటెస్ట్ సమాచారం ప్రకారం, త్రివిక్రమ్ వెంకటేష్‌తో ఓ సినిమా చేయడానికి దాదాపు సిద్ధమయ్యాడు. హరికా & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ ప్రాజెక్ట్ రూపొందనుంది. నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ కాంబినేషన్‌పై ఫుల్ ఎగ్జైట్‌మెంట్‌లో ఉన్నాడట. ఈ సినిమా త్రివిక్రమ్ స్టైల్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, ఎమోషన్స్‌తో నిండి ఉంటుందని టాక్.

వెంకటేష్‌తో ‘నువ్వు నాకు నచ్చావు’, ‘మల్లీశ్వరి’ సినిమాలకు త్రివిక్రమ్ రైటర్‌గా పనిచేశాడు, ఇప్పుడు డైరెక్టర్‌గా వీరి కాంబో సెట్ కావడం అభిమానులకు పండగలా ఉంది. అయితే, త్రివిక్రమ్ మరో ఆసక్తికరమైన ఆప్షన్‌ను కూడా పరిశీలిస్తున్నాడు. తమిళ స్టార్ శివకార్తికేయన్‌తో సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడు. శివకార్తికేయన్‌ ‘అమరన్’ తెలుగులో కూడా గట్టిగానే ఆడింది. ఈ సక్సెస్ తర్వాత అతనితో కూడా పనిచేయాలని త్రివిక్రమ్ ఎగ్జైట్ అయ్యాడట.

శివకార్తికేయన్‌ కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్‌లో స్కోప్‌ను త్రివిక్రమ్ స్టైల్‌లో చూపించాలని భావిస్తున్నాడని టాక్. త్రివిక్రమ్ నిర్ణయం అల్లు అర్జున్ షెడ్యూల్‌పై ఆధారపడి ఉంది. అల్లు అర్జున్ అట్లీ సినిమా షూటింగ్‌కు ఏడాది కంటే ఎక్కువ సమయం తీసుకుంటే, త్రివిక్రమ్ వెంకటేష్‌తో లేదంటే శివకార్తికేయన్ తో సినిమా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. కానీ, అల్లు అర్జున్ కేవలం కొన్ని నెలలు వెయిట్ చేయమని చెబితే, త్రివిక్రమ్ ఇతర ప్రాజెక్ట్‌లను పక్కనపెట్టి అతని కోసం ఎదురుచూడొచ్చు. ఈ రెండు ఆప్షన్స్‌లో ఏది ఫైనల్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.