Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ సంగతేంటి? వెయిట్ చేయాల్సిందేనా?

ఐకాన్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తన నెక్స్ట్ చిత్రం చేస్తారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   16 April 2025 1:30 PM
త్రివిక్రమ్ సంగతేంటి? వెయిట్ చేయాల్సిందేనా?
X

టాలీవుడ్ లో డైరెక్టర్ త్రివిక్రమ్ కు ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెలిసిందే. రచయిత, డైరెక్టర్ గా చెరగని ముద్ర వేసుకున్న ఆయన.. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు. తన రైటింగ్, మేకింగ్, టేకింగ్ తో అలరించారు. త్రివిక్రమ్ అంటే ఒక బ్రాండ్ గా మార్క్ ఏర్పరచుకున్నారు. రీసెంట్ గా గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు బాగానే రాబట్టింది. కానీ త్రివిక్రమ్ మాత్రం చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఆ మూవీ తర్వాత త్రివిక్రమ్.. మరో సినిమా అనౌన్స్ చేయలేదు. ఇదిగో.. అదిగో అంటూ వార్తలు వస్తున్నా.. ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు.

ఐకాన్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తన నెక్స్ట్ చిత్రం చేస్తారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. నిర్మాత నాగవంశీ పలుమార్లు ఆ ప్రాజెక్ట్ పై మాట్లాడారు. భారీ బడ్జెట్ తో పీరియాడికల్ జోనర్ లో మూవీ ఉంటుందని అంచనాలు పెంచారు. దీంతో పుష్ప-2 తర్వాత ఆ సినిమా స్టార్ట్ అవుతుందని అంతా ఊహించారు. కానీ ఇప్పుడు అట్లీ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది.

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఆ సినిమా గ్లింప్స్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఎప్పటి నుంచో బన్నీ కోసం వెయిట్ చేస్తున్న త్రివిక్రమ్.. పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ అందుబాటులోకి వస్తారు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అట్లీ ప్రాజెక్ట్ కొంత భాగం షూటింగ్ పూర్తయ్యాక త్రివిక్రమ్ సెట్స్ లోకి వస్తానని బన్నీ చెప్పారని తెలుస్తోంది.

కానీ అది చాలా కష్టం. రెండు సినిమాల జోనర్స్ వేర్వేరు కనుక.. లుక్స్ మార్చుకుని సినిమా సెట్స్ లోకి రావడం అంత ఈజీ కాదు. దీంతో ఇప్పుడు త్రివిక్రమ్ సంగతేంటనేది చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్ కోసం ఇంకా ఎదురుచూస్తారని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. ఇంతలో అన్ని పనులు పూర్తి చేస్తారని అంటున్నారు.

అదే సమయంలో విక్టరీ వెంకటేష్ తో ఓ మూవీ చేస్తారని.. రామ్ తో సినిమా తీస్తారని , కొత్తగా శివ కార్తికేయ తో చేస్తారని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. కానీ దానిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్లు రాలేదు. దీంతో త్రివిక్రమ్ కు ఏ ఆప్షన్ లేదని.. బన్నీ కోసం వెయిట్ చేయడమే బెటర్ అని సూచిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ నుంచి హామీ తీసుకోవాలని, లేకుంటే మళ్లీ ఆయన వేరే ప్రాజెక్ట్ కు కమిట్ అయితే కష్టమని అంటున్నారు. అయితే త్రివిక్రమ్ ఇప్పటికే బన్నీ నుంచి హామీ తీసుకుని ఉంటారని చెబుతున్నారు.