Begin typing your search above and press return to search.

ఆదర్శ కుటుంబం: ఇంతకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో 'ఆదర్శ కుటుంబం AK 47) సినిమా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.

By:  Tupaki Desk   |   10 Dec 2025 2:03 PM IST
ఆదర్శ కుటుంబం: ఇంతకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?
X

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో 'ఆదర్శ కుటుంబం AK 47) సినిమా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. టైటిల్, పోస్టర్ తోనే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా విషయంలో ఒక ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది. సాధారణంగా త్రివిక్రమ్ సినిమా అంటే టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటే మ్యూజిక్ డైరెక్టర్ పేరు కూడా బయటకు వచ్చేస్తుంది. కానీ ఈసారి పోస్టర్ లో టెక్నీషియన్స్ లిస్ట్ చూస్తే సంగీత దర్శకుడి పేరు కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

నిజానికి సినిమా లాంచ్ సందర్భంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్విట్టర్ లో ఈ ప్రాజెక్ట్ గురించి చాలా ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. "ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాంబో ఇది" అంటూ విషెస్ చెప్పారు. దీంతో ఈ సినిమాకు తమనే మ్యూజిక్ ఇస్తున్నారని చాలామంది ఫిక్స్ అయ్యారు. కానీ అధికారిక పోస్టర్ లో ఆయన పేరు లేకపోవడంతో, ఆయన కేవలం ఒక అభిమానిగా లేదా శ్రేయోభిలాషిగా విష్ చేశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

త్రివిక్రమ్ కి అలాగే హారికా హాసిని బ్యానర్ కి తమన్ ఆస్థాన సంగీత విద్వాంసుడి లాంటి వారు. 'అల వైకుంఠపురములో' నుంచి మొన్నటి 'గుంటూరు కారం' వరకు అతనే కంటిన్యూ అవుతున్నాడు. మరోవైపు 'యానిమల్' ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా తీస్తున్న 'స్పిరిట్' సినిమాకు కూడా ఆయనే పనిచేస్తున్నారు.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో హర్షవర్ధన్ కు మంచి పేరుంది. ఈ 'ఆదర్శ కుటుంబం' టైటిల్ కింద 'AK 47' అనే పవర్ ఫుల్ ట్యాగ్ ఉంది కాబట్టి, ఆ ఇంటెన్సిటీకి తగ్గట్టుగా హర్షవర్ధన్ అయితే న్యాయం చేస్తారని త్రివిక్రమ్ భావించి ఉండవచ్చు. కానీ దీనిపై క్లారిటీ ఇవ్వకపోవడం వెనుక పెద్ద ప్లానే ఉండి ఉంటుంది. సినిమా రిలీజ్ ను 2026 సమ్మర్ కు ప్లాన్ చేశారు. అంటే చేతిలో గట్టిగా నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసినా, పోస్ట్ ప్రొడక్షన్, మ్యూజిక్ సిట్టింగ్స్ కు కనీసం నెల రోజులు పడుతుంది.

ఈ పాటికే మ్యూజిక్ డైరెక్టర్ ను ఫైనల్ చేయకపోతే పనులు ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. బహుశా మ్యూజిక్ డైరెక్టర్ ను ఫైనల్ చేసి ఉంటారు కానీ, సరైన సమయంలో సర్ ప్రైజ్ ఇవ్వాలని దాచిపెట్టి ఉండొచ్చు. ఇంతకుముందు త్రివిక్రమ్ 'గుంటూరు కారం' విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ మార్పులపై జరిగిన రచ్చ మనకు తెలిసిందే.

బహుశా ఆ అనుభవంతో ఈసారి తొందరపడి పేరు ప్రకటించకూడదని నిర్ణయించుకున్నారేమో. లేదా అనిరుధ్ లాంటి స్టార్ ను రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. త్రివిక్రమ్ సినిమాలకు మ్యూజిక్ ఎంత పెద్ద ప్లస్ అయ్యిందో తెలిసిందే. కాబట్టి ఈసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేసే బాధ్యత ఎవరికి అప్పగిస్తారో చూడాలి.