Begin typing your search above and press return to search.

మెగా పవర్ ల మధ్య చక్కని చుక్క..!

అన్నయ్య సినిమా షూటింగ్ స్పాట్ కి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆయన తో కాసేపు ముచ్చటించారు. ఇదే టైం లో మెగా హీరోల తో కలిసి త్రిష ఒక ఫోటో దిగింది.

By:  Tupaki Desk   |   10 April 2024 6:21 AM GMT
మెగా పవర్ ల మధ్య చక్కని చుక్క..!
X

ఇద్దరు మెగా హీరోల మధ్య చక్కని చుక్క చెన్నై చిన్నది త్రిష కృష్ణన్ దర్శనమిచ్చింది. కోలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న త్రిష తెలుగులో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సినిమా చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో త్రిష ఫిమేల్ లీడ్ గా నటిస్తుంది. వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేషాలు షూట్ చేస్తున్నారు. అయితే విశ్వంభర సెట్స్ లోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. అన్నయ్య సినిమా షూటింగ్ స్పాట్ కి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆయన తో కాసేపు ముచ్చటించారు. ఇదే టైం లో మెగా హీరోల తో కలిసి త్రిష ఒక ఫోటో దిగింది. ఓ పక్క మెగాస్టార్.. మరోపక్క పవర్ స్టార్ ఇద్దరి మధ్యలో చక్కని చుక్కగా త్రిష అదుర్స్ అనిపించింది. పవన్ తో కూడా త్రిష జత కట్టింది. లవ్ ఆజ్ కల్ రీమేక్ గా వచ్చిన తీన్మార్ సినిమాలో పవన్ తో కలిసి నటించింది త్రిష. ఆ తర్వాత మళ్లీ ఇద్దరు కలిసి నటించిచలేదు.

ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉగాది శుభాకాంక్షలు అంటూ కామెంట్ పెట్టింది. విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్ గా కేవలం సాంగ్స్ రెండు సీన్స్ అన్నట్టుగా కాకుండా చాలా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది. పాత్ర నచ్చడం వల్లే తెలుగులో అసలు చేసే ఆసక్తి లేకపోయినా త్రిష విశ్వంభరకు సైన్ చేసింది.

అంతకుముందు చిరు నటించిన స్టాలిన్ సినిమాలో నటించిన త్రిష మళ్లీ ఇన్నాళ్లకు చిరుతో కలిసి జత కడుతుంది. చిరు ఆచార్యలో కూడా త్రిష నటించాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల కుదరలేదు. విశ్వంభర సినిమాతో తెలుగులో మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది త్రిష. విశ్వంభర తర్వాత త్రిష వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ ఇలా సీనియర్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. త్రిష టాలీవుడ్ రీ ఎంట్రీ ఆమెకు ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో చూడాలి. కోలీవుడ్ లో తన ఫాం తెలుసు కాబట్టి త్రిషకు అడిగిన దానికన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా తెలుగు నిర్మాతలు వెనకాడట్లేదని తెలుస్తుంది.