Begin typing your search above and press return to search.

ఫేక్ ఫెమినిస్ట్.. యానిమల్ రివ్యూ చెప్పిన‌ త్రిషపై ట్రోలింగ్

కొద్దిరోజుల క్రితమే త్రిష‌ మహిళల గౌరవం గురించి మాట్లాడారని, ఇప్పుడు మహిళలను ప్రతికూలంగా చూపించిన సినిమాను ప్రశంసించారని కొందరు విమర్శించారు.

By:  Tupaki Desk   |   4 Dec 2023 4:19 AM GMT
ఫేక్ ఫెమినిస్ట్.. యానిమల్ రివ్యూ చెప్పిన‌ త్రిషపై ట్రోలింగ్
X

ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో అందాల క‌థానాయిక‌ త్రిష కృష్ణన్ పేరు నిరంత‌రం హెడ్ లైన్స్‌లో నిలుస్తోంది. తన ఇటీవలి చిత్రం లియో విజయం సంద‌ర్భంగా వ‌రుస ఇంట‌ర్వ్యూల‌తో లైమ్ లైట్ లో క‌నిపించింది. ఇంత‌లోనే లియో కోస్టార్ మన్సూర్ అలీ ఖాన్ అవ‌మాన‌క‌ర‌ వ్యాఖ్యలు త్రిష‌ను ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు యానిమల్ చిత్రంపై త్రిష‌ సమీక్ష ర‌క‌ర‌కాల‌ కారణాల వల్ల హెడ్ లైన్స్ లోకి వ‌చ్చింది.

గత రాత్రి రణబీర్ కపూర్ చిత్రం 'యానిమల్' గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సోష‌ల్ మీడియాలో వ‌న్ లైన‌ర్ స‌మీక్ష చేస్తూ "ఒక మాట - CULT! Pppppppaaaaaahhhhhh" అని వ్యాఖ్య‌ను జోడించింది. ఈ పోస్ట్ చాలా మంది నెటిజనుల్ల అగ్గి రాజేసింది. త్రిష‌ సమీక్షపై వ్యాఖ్యానించడానికి ప్రేరేపించింది. కొద్దిరోజుల క్రితమే త్రిష‌ మహిళల గౌరవం గురించి మాట్లాడారని, ఇప్పుడు మహిళలను ప్రతికూలంగా చూపించిన సినిమాను ప్రశంసించారని కొందరు విమర్శించారు.

కొందరు త్రిష‌ను 'నకిలీ ఫెమినిస్ట్' అని కూడా దూషించారు. మరికొందరు మీమ్స్‌తో ట్రోల్ చేశారు. ఈ త‌ర‌హా ఎదురు దాడిని ఊహించ‌ని త్రిష తక్షణమే ఆ పోస్ట్ ని తొలగించింది. అయితే సంబంధిత సమీక్ష స్క్రీన్‌షాట్‌లు ఇంటర్నెట్‌లో వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. వృత్తిపరంగా చూస్తే.. మ‌ణిర‌త్నం పొన్నియ‌న్ సెల్వ‌న్ లో త్రిష న‌ట‌న‌కు గొప్ప పేరొచ్చింది. ఇప్పుడు విడాముయార్చి - థగ్ లైఫ్ వంటి భారీ ప్రాజెక్ట్‌లలో న‌టిస్తోంది.