Begin typing your search above and press return to search.

ఆ జోన్‌లోనే ప్రమాదాలెందుకు?.. సస్పెన్స్ గా త్రిష 'ది రోడ్‌' ట్రైలర్‌

తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్ థ్రిలర్ గా విడుదలై ఆకట్టుకుంటోంది.

By:  Tupaki Desk   |   22 Sep 2023 6:48 AM GMT
ఆ జోన్‌లోనే ప్రమాదాలెందుకు?.. సస్పెన్స్ గా త్రిష  ది రోడ్‌ ట్రైలర్‌
X

సౌత్ క్వీన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తున్నా .. ఈ అమ్మడు మాత్రం రెండు దశాబ్దాలుగా తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది. ఇంకా అదే అందం, అదే యాక్టింగ్ తో అలరిస్తోంది. ప్రస్తుతం ఈ భామ.. ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ది రోడ్‌. రివెంజ్‌ ఇన్‌ 462 kms అనేది ట్యాగ్ లైన్. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్ థ్రిలర్ గా విడుదలై ఆకట్టుకుంటోంది.


ఈ చిత్రాన్ని దర్శకుడు అరుణ్‌ వాసిగరన్‌ తెరకెక్కించారు. తమిళనాడు రహదారులపై జరిగిన ప్రమాదాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా వీటిని తెరకెక్కించారని మూవీ టీమ్ చెబుతోంది.NH 44 లో ఒక పర్టిక్యులర్ జోన్ లో మాత్రమే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అక్కడే ఎందుకు జరుగుతున్నాయి? అందుకు కారణాలు ఏంటి? ఎవరైన కావాలనే చేయిస్తున్నారా? అనేది తెలుసుకోవడానికి త్రిష రంగంలోకి దిగడం, ఆ ప్రమాదాల వెనక ఏదో ఓ రివెంజ్ దాగి ఉన్నట్లు త్రిష కనిపెడటం చూపించారు.

కానీ ఆ తర్వాత మధ్యలో కాసేపు త్రిషకు మాత్రమే ఈ ప్రమాదాలు కనిపించడం అనేది ఓ ట్విస్ట్. మరి అసలీ రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఏమిటి? ఈ ప్రమాదాల వెనక ఉన్న వారు ఎవరు? అనేది త్రిష ఎలా ఛేదించిందో తెలుసుకోవాలంటే సినిమా వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

ఇకపోతే త్రిషకు ఇలాంటి ఇన్​ వెస్టిగేషన్ పాత్రలు కొత్తేమీ కాదు. పోలీస్ ఆఫీసర్​గా, జర్నలిస్ట్​గా పాత్రల్లో కనిపించి పలు కేసులను ఛేదించింది. కాబట్టి ఈ చిత్రంలో కూడా ఆమె పాత్ర మంచి ఇంటెన్సివ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రచార చిత్రంలో సామ్ సీఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా ఉంది.

కాగా, ఈ చిత్రాన్ని అక్టోబరు 6న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటివరకు ఇంటెన్సివ్ గా సాగిన ఈ ట్రైలర్ ను చూసేయండి. తెలుగు, తమిళం, హిందీలో ఈ ప్రచార చిత్రం అందుబాటులో ఉంది. వీడియో చూసేటప్పుడు సెట్టింగ్స్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేసి ఆడియో ట్రాక్‌ ఆప్షన్‌ మీకు నచ్చిన భాషను ఎంపిక చేసుకోని చూడొచ్చు.